ల్యాప్‌ట్యాప్‌లు, ఎల్‌ఈడీ టీవీలు చోరీలు చేస్తున్న పాత నేరస్థుల అరెస్టు

రెండు ల్యాప్‌టాప్‌లు, ఎల్‌ఈడీ టీవీ స్వాధీనం  హైదరాబాద్, కార్వాన్‌: ల్యాప్‌ట్యాప్‌లు, ఎల్‌ఈడీ టీవీలు చోరీ చేస్తున్న ఇద్దరు పాత నేరస్థులను టప్పాచబుత్ర పోలీసులు అరెస్టు చేశారు. కార్వాన్‌ రాంసింగ్‌పూరా ప్రాంతానికి చెందిన కున్‌చన్‌ రాజు అలియాస్‌ భువనగిరి రాజు, కార్వాన్‌ జాఫర్‌గూడ ప్రాంతానికి చెందిన సద్దు వేణుగోపాల్‌ గత కొంతకాలంగా దొంగతనాలు చేస్తున్నారు. వీరిద్దరూ సోమవారం యాదవభవన్‌ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకుని

ఎంసెట్‌ నిర్వహణపై మంత్రి గంటా సమీక్ష..

విజయవాడ: ఎంసెట్‌ నిర్వహణపై మంత్రి గంటా సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల అధికారులతో మంత్రి గంటా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. కాగా..ఎంసెట్‌ రోజు అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాలకు ప్రతి 15 నిమిషాలకో బస్సు నడుపుతామని ఆర్టీసీ ఎండీ మీడియాకు వివరించారు.

పీఎస్‌ఎల్‌వీ-33 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం

నెల్లూరు: ఈనెల 28న షార్‌ నుంచి శాస్త్రవేత్తలు పీఎస్‌ఎల్వీ-సీ33 రాకెట్‌ ప్రయోగం చేయనున్నారు. దీంతో మంగళవారం ఉదయం 9.20కి రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభం అయింది. దేశ నావిగేషన్‌ వ్యవస్థకు సంబంధించిన చివరి శాటిలైట్‌.. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1జీ ను కక్ష్యలోకి శాస్త్రవేత్తలు పంపనున్నారు. ఈనెల 28న మధ్యాహ్నం 12.50కి నింగిలోకి రాకెట్‌ దూసుకుపోనుంది. సుమారు 51 గంటల 5నిమిషాల పాటు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ జరగనుంది. స్వదేశీ జీపీఎస్ పటిష్టం చేసే విధంగా

తగ్గిన మామిడి ధరలు

విజయవాడ: నున్న మార్కెట్‌లో మామిడి ధరలు తగ్గాయి. సోమవారం బంగినపల్లి రకం టన్ను కనిష్ఠ ధర రూ.20 వేలు పలుకగా, గరిష్ఠ ధర రూ.40 వేలు, తోతాపురి రకం టన్ను కనిష్ఠ ధర రూ.8 వేలు, గరిష్ఠ ధర రూ.16 వేలు పలికాయి. చెరకు రసాలు టన్ను కనిష్ఠ ధర రూ.14 వేలు, గరిష్ఠ ధర రూ.23 వేలు పలికాయి.

పవర్‌గ్రిడ్‌లో సాంకేతిక లోపం..ఉత్తరాంధ్రకు కరెంట్‌ కష్టాలు

విజయవాడ : పవర్‌ గ్రిడ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఉత్తరాంధ్రకు కరెంట్‌ కష్టాలు తలెత్తనున్నాయి. గత మూడు రోజులుగా ఉత్తరాంధ్రలో విద్యుత్ కొరత తీవ్రంగ వేధిస్తోంది. మొదటిరోజు వేమగిరి సబ్‌స్టేషన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యతో రైళ్లతోసహా అన్నిటికి విద్యుత్ నిలిచిపోయినట్లు తెలియవచ్చింది. ఆదివారం మధ్యాహ్నం రైళ్లకు విద్యుత్ అందించినప్పటికీ ఉత్తరాంధ్రలో పలు చోట్ల విద్యుత్ నిలిచిపోయింది. సోమ, మంగళవారం కూడా గ్రిడ్‌లో సాంకేతిక లోపం ఏర్పడడంతో ఆ ప్రభావం ఎక్కడ

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వడగాలులు

 తెలుగురాష్ట్రాల్లో నేడు, రేపు వడగాలులు ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తిగా పొడివాతావరణం ఉండటం, కోస్తాను ఆనుకొని ఓ ద్రోణి కొనసాగుతోంది. ఆ ద్రోణి ప్రభావంతో తేమ తక్కువున్న గాలులు పూర్తిగా పైకి వచ్చే అవకాశముంది. దీంతో ఎక్కువ ప్రభావం తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు..ఎండ వేడికి రైలు పట్టాలు

ధనాధన్‌.. ఫటాఫట్‌

దేశీయ టీ20 ధమాకాకు రంగం సిద్ధమైంది. ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ తొమ్మిదో సీజన్‌కు శనివారమే శ్రీకారం. ముంబయిలోని వాంఖడె స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌.. కొత్త జట్టు రైజింగ్‌ పుణె జెయింట్స్‌ను ఢీకొనబోతోంది. రెండు జట్లూ బలంగా ఉన్న నేపథ్యంలో తొలి పోరే హోరాహోరీగా సాగుతుందని అంచనా. ధోని నేతృత్వంలోని పుణెతో పాటు రైనా సారథ్యంలోని గుజరాత్‌ లయన్స్‌ కూడా తొలిసారి ఐపీఎల్‌ ఆడబోతున్న

రాకెట్‌ ఇంజిన్‌ ప్రయోగించిన ఉ.కొరియా

సియోల్‌: ఖండాతర లాంగ్‌-రేంజ్‌ బాలిస్టిక్‌ రాకెట్‌ ఇంజిన్‌ను విజయవంతంగా ప్రయోగించినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది. దీని ద్వారా అమెరికాపై కూడా అణ్వస్త్ర దాడులు చేయవచ్చు. ఈ ఇంజిన్‌ ప్రయోగం విజయవంతమైన విషయం నిజమైతే ఉత్తర కొరియా న్యూక్లియర్‌ ఆయుధ సంపత్తిలో మరో అడుగు ముందుకెళ్లినట్లు అవుతుంది. అయితే ఉత్తర కొరియా వద్ద నమ్మదగిన ఖండాతర బాలిస్టిక్‌ క్షిపణి లేదని దక్షిణ కొరియా వెల్లడించింది. ఉత్తర కొరియా ఇటీవల పలు మార్లు

అత్యంత భారీ కృష్ణబిలాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు

లాస్‌ ఏంజిల్స్‌: అత్యంత భారీ కృష్ణబిలాన్ని అంతరిక్ష శాస్త్రవేత్తలు గుర్తించారు. 17 బిలియన్‌ సూర్యులు ఒదిగిపోయేంత పరిమాణంలో ఈ కృష్ణబిలం ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటి వరకు గుర్తించిన అతిపెద్ద కృష్ణబిలం సుమారు 10 బిలియన్‌ సూర్యుల పరిమాణంలో ఉంటుంది. కాలిఫోర్నియా బెర్కిలీ విశ్వవిద్యాలయం 2011లో కనుగొన్న ఈ కృష్ణబిలాన్ని అతిపెద్దదిగా గుర్తించి గిన్నిస్‌ బుక్‌లో నమోదు చేశారు. కొత్తగా కనుగొన్న కృష్ణబిలం ‘ఎన్‌జీసీ 1600’ కోమా క్లస్టర్‌కు వ్యతిరేక

పూరితో రోహిత్‌?

‘మాస్‌ హీరోగా నిలబడాలంటే పూరి జగన్నాథ్‌తో కనీసం ఓ సినిమా చేయాల్సిందే’ అనే మాటని మన హీరోలంతా నమ్ముతారు. అందుకే… పూరి అంటే కథానాయకులకు ఇప్పటికీ అంత క్రేజ్‌. తమలోని మాస్‌ యాంగిల్‌ని పూరి నూటికి నూరుపాళ్లూ బయటకు తీసుకొస్తాడని హీరోల నమ్మకం. ఇప్పుడు నారా రోహిత్‌ కూడా పూరి వైపు దృష్టిసారిస్తున్నాడట. ‘తుంటరి’, ‘సావిత్రి’ చిత్రాలతో మాస్‌ దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశాడు నారా రోహిత్‌. అయితే