Author: admin

స్పేస్‌-‘ఎక్స్‌’లెంట్‌..! అంతరిక్ష యానంలో మరో ముందడుగు

కాలిఫోర్నియా: అమెరికాకు చెందిన ప్రైవేటు స్పేస్‌ ఏజెన్సీ స్పేస్‌-ఎక్స్‌ చారిత్రక విజయం సాధించింది. మొదటిసారిగా స్పేస్‌-ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ను అట్లాంటిక్‌ మహా సముద్రంలోని డ్రోన్‌షిప్‌పై విజయవంతంగా ల్యాండ్‌ చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వస్తువులను మోసుకెళ్లిన ఈ రాకెట్‌ తిరిగి సురక్షితంగా సముద్రంపై లాంచింగ్‌ ప్యాడ్‌పై ల్యాండ్‌ అయ్యింది. డ్రోన్‌షిప్‌పై రాకెట్‌ను సురక్షితంగా ల్యాండ్‌ చేయడంలో స్పేస్‌-ఎక్స్‌ ఇప్పటికి పలుమార్లు విఫలమైంది. ఎట్టకేలకు ఇప్పుడు విజయం సాధించింది. నేలపై

ఆగస్టు 12న ‘మొహెంజోదారో’

ముంబయి: హృతిక్‌ రోషన్‌, పూజా హెగ్దే జంటగా రూపుదిద్దుకుంటున్న ‘మొహెంజోదారో’ చిత్ర షూటింగ్‌ పూరైంది. కథానాయకుడు హృతిక్‌ రోషన్‌ ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ.. ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రంతో తనకు మంచి స్నేహితులు ఏర్పడ్డారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నటి పూజా హెగ్దే, దర్శకుడు అశుతోష్‌ గోవారికర్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ఆగస్టు 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు.

ఐరాసలో తొలిసారిగా అంబేడ్కర్‌ జయంతి

యునైటెడ్‌ నేషన్స్‌: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125వ జయంతిని పురస్కరించుకుని తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలో వేడుకలు నిర్వహించనున్నారు. ఆయన జయంతికి ఒక రోజు ముందుగానే ఏప్రిల్‌ 13న ఈ వేడుకలు జరగనున్నట్లు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ వెల్లడించారు. కల్పనా సరోజ్‌, హ్యూమన్‌ హారిజాన్‌ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలోభారత శాశ్వత ప్రతినిధుల బృందం ఈ వేడుకలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా అసమానతలపై పోరాటం.. అభివృద్ధి

మే చివరి వరకు సమయం కావాలి: మాల్యా

ముంబయి: బ్యాంకుల నుంచి రూ.వేల కోట్లు అప్పుగా తీసుకొని చెల్లించకుండా విచారణ ఎదుర్కొంటున్న విజయ్‌ మాల్యా నేడు ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేటు (ఈడీ) ఎదుట గైర్హాజరయ్యారు. ప్రస్తుతం విచారణకు హాజరుకాలేనని ఆయన వెల్లడించారు. మే చివరి వరకు గడువు కోరారు. విచారణకు మే చివర్లో ఓ తేదీ నిర్ణయించమని అడిగారు. మాల్యా ప్రస్తుతం లండన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 9న విచారణకు హాజరుకావాలని ఇటీవల ఈడీ విజయ్‌ మాల్యాకు సమన్లు

హంద్రీనీవా సొరంగం పనులను పరిశీలించిన సీఎం

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన కొనసాగుతోంది. మదనపల్లి మండలం కోళ్లబయలు చేరుకున్న సీఎం.. హంద్రీనీవా ఎత్తిపోతల పథకం సొరంగం పనులను పరిశీలించారు. కాసేపట్లో హంద్రీనీవా ఎత్తిపోతల పథకం పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

వికలాంగులకు అన్ని రంగాల్లో శిక్షణ: వెంకయ్య

విజయవాడ: అంగవైకల్యం వచ్చిందని నిరాశవద్దు.. కేంద్రం చేయూత ఇస్తోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. శనివారం కృష్ణాజిల్లా ఉంగుంటూరు మండలం ఆత్కూరులో స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వికలాంగులకు చేయూత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. వికలాంగులకు మూడు చక్రాల వాహనాలు, కృత్రిమ కాళ్లు, వీల్‌ ఛైర్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సమాజంలో వికలాంగులకు అన్ని రకాల అవకాశాలు కల్పించాలని సూచించారు. వికలాంగుల కోసం దేశవ్యాప్తంగా వందలాది శిబిరాలు

415 లక్షల కోట్ల ఖర్చు

మధుమేహం, హృద్రోగాలపై భారతీయులు వెచ్చించే మొత్తం ఇది  నగరీకరణతో వ్యాధుల చెరలోకిదీర్ఘకాలిక వ్యాధుల చెరలో భారత్  ఐక్యరాజ్య సమితి, ఏప్రిల్‌ 8: హృద్రోగాలు, మధుమేహం, కేన్సర్‌వంటి దీర్ఘకాలిక వ్యాధులు భారత ఆర్థికవ్యవస్థను పీల్చి పిప్పిచేస్తున్నాయి. ఆయా వ్యాధిపీడితుల సంఖ్య వేగంగా పెరుగుతోందని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది. వీటి చికిత్స కోసం 2012-30 మధ్య భారతలో ఖర్చు రూ.415 లక్షల కోట్లకు చేరుతుందని ఐరాస నివేదిక వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ,

పుష్కర చండీరుద్ర మహాయాగం ప్రారంభం

మెదక్‌ జిల్లాలో 12 సంవత్సరాలు కొనసాగనున్న క్రతువు న్యాల్‌కల్‌, ఏప్రిల్‌ 8: కృతయుగంలో సప్తర్షుల ఆజ్ఞ మేరకు శౌనకాది మహామునులు నిర్వహించారని చెప్పే యాగం.. పుష్కరకాల చండీ రుద్ర మహా యాగం! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పన్నెండేళ్లపాటు జరిగే ఈ యాగాన్ని చరిత్రలో రాజులు, చక్రవర్తులు లోక కల్యాణార్థం నిర్వహించారని చెబుతారు. అంతటి అరుదైన యాగాన్ని.. మెదక్‌ జిల్లా న్యాల్‌కల్‌ మండలం రాఘవాపూర్‌ గ్రామ శివారులో మంజీరా

పన్ను కట్టలేదని గుడికి తాళం

అనంతపురం అమ్మవారి శాలపై ప్రతాపం ఒకరోజుకుపైగా ఆలయానికి తాళాలు ఆందోళనతో వెనక్కి తగ్గిన అధికారులు అనంతపురం : ఆస్తి పన్ను చెల్లించని వారు కోకొల్లలు! అందులో… ఎందరెందరో బడాబాబులు! కానీ… అధికారులు మాత్రం ఒక ఆలయంపై ప్రతాపం చూపించారు. పన్ను కట్టలేదంటూ గుడికి తాళం వేసేశారు. భారీ ఎత్తున ఆందోళన చేయడంతో… దిగి వచ్చారు. అనంతపురం పట్టణంలోని కొత్తవూరు అమ్మవారి శాల (వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం)విషయంలో మునిసిపల్‌ అధికారులు ఇలా

INFORMATIONDEPARTMENT COMMISIONER-S.VENKATESWAR IN AP

హైదరాబాద్‌: రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్‌గా ఇండియన్‌ ఇన్ఫ్‌ర్మేషన్‌ సర్వీ్‌స(ఐఐఎస్‌ 1989బ్యాచ్‌) అధికారి ఎస్‌.వెంకటేశ్వర్‌ను ప్రభుత్వం నియమించనుంది. ఆయన గతంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో దూరదర్శన్‌, ఆల్‌ ఇండియా రేడియోల్లో పనిచేశారు. ప్రస్తుతం బెంగళూరులో ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) అదనపు డీజీగా పనిచేస్తున్నారు. ఆయనను ఏపీ సమాచారశాఖ కమిషనర్‌గా నియమించుకుంటామని, డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి కేటాయించాలని కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ