సెల్‌ఫోన్‌ బదులు రాళ్లు పంపాడు..ఇప్పుడు ఊచలు లెక్కెడుతున్నాడు.!

  • ఎల్‌జీ మొబైల్‌ ఫోన్‌, రూ. 19 వేలు స్వాధీనం  1360346210_.3 సెల్‌ఫోన్‌ అమ్ముతానని ఓఎల్‌క్స్‌లో ప్రకటన ఇచ్చి రాళ్లు పంపుతున్న వ్యాపారిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం హౌరాకి చెందిన యువ వ్యాపారి మహ్మద్‌ ఫహద్‌ అలియాస్‌ నైనే సులభంగా డబ్బు సంపాదించడానికి మోసాన్నే మార్గంగా ఎంచుకున్నాడు.
            ఓఎల్‌క్స్‌ వెబ్‌సైట్‌లో శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌-4ని రూ.19 వేలకు అమ్ముతానని ఫిబ్రవరిలో ప్రకటన ఇచ్చాడు. దానిని కొనుగోలు చేయడానికి అనేకమంది అతడిని సంప్రదించారు. బ్యాంకులో డబ్బు డిపాజిట్‌ చేయించుకుని వారికి ఖాళీ శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 4 బాక్స్‌లో రాయి పెట్టి కొరియర్‌ ద్వారా పార్సిల్‌ పంపేవాడు. ఆ తర్వాత తన ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌ చేసేవాడు. ఈ విధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 20 నుంచి 30 మందిని మోసం చేశాడు. నగర సైబర్‌క్రైం ఇన్‌స్పెక్టర్‌ జి.శంకరరాజుకి ఫిర్యాదు అందడంతో నిందితుడిని అరెస్టు చేసి ఎల్‌జీ మొబైల్‌ ఫోన్‌, రూ.19 వేలు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

70 − 65 =