ల్యాప్‌ట్యాప్‌లు, ఎల్‌ఈడీ టీవీలు చోరీలు చేస్తున్న పాత నేరస్థుల అరెస్టు

  • రెండు ల్యాప్‌టాప్‌లు, ఎల్‌ఈడీ టీవీ స్వాధీనం 

హైదరాబాద్, కార్వాన్‌: ల్యాప్‌ట్యాప్‌లు, ఎల్‌ఈడీ టీవీలు చోరీ చేస్తున్న ఇద్దరు పాత నేరస్థులను టప్పాచబుత్ర పోలీసులు అరెస్టు చేశారు. కార్వాన్‌ రాంసింగ్‌పూరా ప్రాంతానికి చెందిన కున్‌చన్‌ రాజు అలియాస్‌ భువనగిరి రాజు, కార్వాన్‌ జాఫర్‌గూడ ప్రాంతానికి చెందిన సద్దు వేణుగోపాల్‌ గత కొంతకాలంగా దొంగతనాలు చేస్తున్నారు. వీరిద్దరూ సోమవారం యాదవభవన్‌ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చోరీ చేసినట్టు అంగీకరించారు. వారి వద్ద నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, ఎల్‌ఈడీ టీవీ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.img-Thieves-punch-76-year-old-woman-inside-Omaha-church

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

73 − = 69