ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పర్మిట్లు రద్దు

 • ఆటోవాలాలపై కొరడా ఝళిపించనున్న ట్రాఫిక్‌ పోలీసులు….
 • మే 16 నుంచి అమలు
6888628640_feb24020e6_b హైదరాబాద్‌ సిటీ : నగరంలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన ఆటోవాలాల పర్మిట్లు మోటార్‌ వాహనాల చట్టం సెక్షన్‌ 86 ప్రకారం రద్దు చేస్తామని నగర ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ (ట్రాఫిక్‌) జితేందర్‌, తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆటో డ్రైవర్లు, ట్రాఫిక్‌ పోలీసుల ఫీల్ట్‌ స్టాఫ్‌, రవాణాశాఖ సిబ్బందికి అవగాహన కలిగించి తర్వాత ఈ కార్యక్రమాన్ని మే 16 నుంచి అమలు చేస్తామని తెలిపారు. ట్రాఫిక్‌ పోలీసులకు సోషల్‌ మీడియా ద్వారా ఆటోవాలాలపై 90 శాతం ఫిర్యాదులు రావడంతో ఈ చర్య తీసుకున్నట్టు వారు తెలిపారు.
 • మీటర్‌ వేయకుండా ఆటోల్లో ప్రయాణికులను తీసుకువెళ్లడం 
 • మీటర్‌ని ట్యాంపరింగ్‌ చేయడం 
 • వ్యాలిడిటీ కలిగిన డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా ఆటోని నడపడం 
 • అదనంగా ప్రయాణికులను ఎక్కించుకోవడం 
 • అనుమతించిన సీట్లలో కాకుండా ఎక్కువమంది కూర్చొనేలా అదనపు సీట్లను అమర్చడం 
 • నగరంలో అనుమతి లేని రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌ నగర్‌ తదితర జిల్లాల ఆటోలు తిరగడం 
 • ఓవర్‌ లోడింగ్‌ 
 • మీటర్‌ చార్జీ కన్నా ప్రయాణికులను ఎక్కువ డబ్బు డిమాండ్‌ చేయడం 
 • ప్రయాణికుడు తీసుకువెళ్లమన్న ప్రదేశానికి వెళ్లడానికి తిరస్కరించడం, అధికంగా డబ్బు డిమాండ్‌ చేయడం 
 • మూడుసార్లు, అంతకంటే ఎక్కువ ఉల్లంఘనలకు పాల్పడిన ఆటోవాలాల పర్మిట్‌ను రద్దుచేస్తామని తెలిపారు. ఇప్పటివరకు జరిమానాతో సరిపెట్టామని, ఇకపై కఠినంగా వ్యవహరించనున్నామని వారు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

98 − 91 =