ఎర్లీబర్డ్‌ పథకానికి అనూహ్య స్పందన

హైదరాబాద్, శేరిలింగంపల్లి : జీహెచ్ఎంసీ ప్రకటించిన ఎర్లీబర్డ్‌ పథకం మంచి ఫలితాలనిస్తుందని వెస్ట్‌జోన్‌ కమిషనర్‌ గంగాధర్‌రెడ్డి తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో గల ఆస్తిపన్ను చెల్లింపుదారులు 31లోగా పూర్తిగా ఆస్తిపన్నులు చెల్లించిన వారికి 5 శాతం రాయితీ కల్పించిన వారికి ఈ రాయితీకి పనులు చెల్లింపుదారులు అనేకమంది ముందుకొచ్చి చెల్లిస్తున్నారన్నారు. శేరిలింగంపల్లి సర్కిల్‌లో ఇప్పటి వరకు 5,935 మంది ముందుకొచ్చి చెల్లించారన్నారు.
               వారి నుంచి సుమారు రూ.7.80కోట్ల ఆస్తిపన్ను వసూలు చేశామ న్నారు. సర్కిల్‌-12లో 7,098 మంది రూ.4.50కోట్లు చెల్లించారన్నారు. సర్కిల్‌-13లో 1,541 మంది ముందు కొచ్చి రూ.69లక్షలు చెల్లించారన్నారు. సర్కిల్‌-14ఎలో మొత్తం 6,505 మంది రూ.4.5కోట్లు, సర్కిల్‌-14బిలో 5,041 మంది ముందుకొచ్చి రూ.2.85కోట్లు చెల్లిం చారన్నారు. ఈ అవకాశం 31 వరకు మాత్రమే ఉందని ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఎర్లీబర్డ్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్‌ కోరారు.download (2)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

+ 25 = 33