ఆస్పత్రుల్లో స్వచ్ఛంద సంస్థలు సేవలందించాలి

 హైదరాబాద్‌ సిటీ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్వచ్ఛంద సంస్థలు సేవలందించాలని వైద్యఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్‌ తివారి కోరారు. ఎంఎన్‌జే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అంకాలజీ అండ్‌ రీజనల్‌ కేన్సర్‌ సెంటర్‌లో హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన‘హెల్ప్‌ డెస్క్‌- కేన్సర్‌ హెల్ప్‌ లైన్‌’ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల మెరుగు కోసం ప్రభుత్వం అదనంగా బడ్జెట్‌ కేటాయించిందని చెప్పారు.
            కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో రోగులకు ఇబ్బందులు కలగకుంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఎంఎన్‌ జే కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో యంత్రాల కొనుగోళ్లలో జరిగిన అవ కతవకలపై న్యాయవిచారణ జరుపు తున్నామని, నివేదిక వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ముజ్తబా అస్కారి మాట్లాడుతూ అంకాలజీ, పాలియేటివ్‌ కేర్‌ చికిత్సలో రోగులకు అంతర్జాతీయ ప్రమా ణాలను అందించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని చెప్పారు. మూడు హెల్ప్‌ డెస్క్‌లు, నలుగురు కార్యకర్తలు నిత్యం అందుబాటులో ఉంటారని చెప్పారు.
         హెల్ప్‌డెస్క్‌ ద్వారా ఆస్ప త్రికి సంబంధించిన పూర్తి సమాచారం, అవసరమైన సేవలను ఒకే చోట నుంచి అందే విధంగా చేస్తామ న్నారు. ప్రొస్తటిక్స్‌, కీమో పోర్ట్‌, కీమో డ్రగ్స్‌కు సంబంధించిన వైద్య అవస రాలపై రోగులకు వివరిస్తామన్నారు. కేన్సర్‌ నివారణ, ఆరోగ్యకరమైన జీవ న విధానం, పోషకాహారం, మందుల వినియోగం తదితర అంశాలపై హెల్ప్‌డెస్క్‌ కార్యకర్తలు రోగులకు కౌన్సెలింగ్‌ చేస్తారని చెప్పారు. కార్య క్రమంలో ఆస్పత్రి డైరెక్టర్‌ జయలత పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

97 − = 87