రాకెట్‌ ఇంజిన్‌ ప్రయోగించిన ఉ.కొరియా

సియోల్‌: ఖండాతర లాంగ్‌-రేంజ్‌ బాలిస్టిక్‌ రాకెట్‌ ఇంజిన్‌ను విజయవంతంగా ప్రయోగించినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది. దీని ద్వారా అమెరికాపై కూడా అణ్వస్త్ర దాడులు చేయవచ్చు. ఈ ఇంజిన్‌ ప్రయోగం విజయవంతమైన విషయం నిజమైతే ఉత్తర కొరియా న్యూక్లియర్‌ ఆయుధ సంపత్తిలో మరో అడుగు ముందుకెళ్లినట్లు అవుతుంది. అయితే ఉత్తర కొరియా వద్ద నమ్మదగిన ఖండాతర బాలిస్టిక్‌ క్షిపణి లేదని దక్షిణ కొరియా వెల్లడించింది.

download (9)ఉత్తర కొరియా ఇటీవల పలు మార్లు క్షిపణి ప్రయోగాలు, అణ్వస్త్ర పరీక్షలతో రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా ఉ.కొరియా వెనక్కి తగ్గడం లేదు. దీని దుందుడుకు చర్యలతో ఉత్తర, దక్షిణ కొరియాల సరిహద్దుల్లో గత కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా అమెరికాపై దాడులు చేయగల ఖండాతర లాంగ్‌-రేంజ్‌ బాలిస్టిక్‌ రాకెట్‌ ఇంజిన్‌ ప్రయోగించామని ఉత్తర కొరియా అధికారిక వార్తా ఏజెన్సీ ప్రకటించింది. అయితే ఉత్తర కొరియా ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను ఆపేయాలని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికార ప్రతినిధి మార్క్‌ టోనర్‌ హెచ్చరించారు.

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

73 − = 64