పూరితో రోహిత్‌?

‘మాస్‌ హీరోగా నిలబడాలంటే పూరి జగన్నాథ్‌తో కనీసం ఓ సినిమా చేయాల్సిందే’ అనే మాటని మన హీరోలంతా నమ్ముతారు. అందుకే… పూరి అంటే కథానాయకులకు ఇప్పటికీ అంత క్రేజ్‌. తమలోని మాస్‌ యాంగిల్‌ని పూరి నూటికి నూరుపాళ్లూ బయటకు తీసుకొస్తాడని హీరోల నమ్మకం. ఇప్పుడు నారా రోహిత్‌ కూడా పూరి వైపు దృష్టిసారిస్తున్నాడట. ‘తుంటరి’, ‘సావిత్రి’ చిత్రాలతో మాస్‌ దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశాడు నారా రోహిత్‌. అయితే అవంత సత్ఫలితాలను ఇవ్వలేదు. అందుకే ఈసారి ఇంకాస్త గట్టి ఎఫెక్ట్‌ పెడదామనుకొంటున్నాడట. అందులో భాగంగానే పూరి జగన్నాథ్‌తో జట్టు కట్టబోతున్నాడని టాక్‌. పూరి – నారా రోహిత్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతోందని అందుకు సన్నాహాలూ జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం పూరి కన్నడలో ‘రోగ్‌’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ తరవాత కల్యాణ్‌రామ్‌తో ఓ సినిమా ఉంటుంది. మరి రోహిత్‌ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో?puri_to_do_4films

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 + = 21