Day: April 9, 2016

ధనాధన్‌.. ఫటాఫట్‌

దేశీయ టీ20 ధమాకాకు రంగం సిద్ధమైంది. ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ తొమ్మిదో సీజన్‌కు శనివారమే శ్రీకారం. ముంబయిలోని వాంఖడె స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌.. కొత్త జట్టు రైజింగ్‌ పుణె జెయింట్స్‌ను ఢీకొనబోతోంది. రెండు జట్లూ బలంగా ఉన్న నేపథ్యంలో తొలి పోరే హోరాహోరీగా సాగుతుందని అంచనా. ధోని నేతృత్వంలోని పుణెతో పాటు రైనా సారథ్యంలోని గుజరాత్‌ లయన్స్‌ కూడా తొలిసారి ఐపీఎల్‌ ఆడబోతున్న

రాకెట్‌ ఇంజిన్‌ ప్రయోగించిన ఉ.కొరియా

సియోల్‌: ఖండాతర లాంగ్‌-రేంజ్‌ బాలిస్టిక్‌ రాకెట్‌ ఇంజిన్‌ను విజయవంతంగా ప్రయోగించినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది. దీని ద్వారా అమెరికాపై కూడా అణ్వస్త్ర దాడులు చేయవచ్చు. ఈ ఇంజిన్‌ ప్రయోగం విజయవంతమైన విషయం నిజమైతే ఉత్తర కొరియా న్యూక్లియర్‌ ఆయుధ సంపత్తిలో మరో అడుగు ముందుకెళ్లినట్లు అవుతుంది. అయితే ఉత్తర కొరియా వద్ద నమ్మదగిన ఖండాతర బాలిస్టిక్‌ క్షిపణి లేదని దక్షిణ కొరియా వెల్లడించింది. ఉత్తర కొరియా ఇటీవల పలు మార్లు

అత్యంత భారీ కృష్ణబిలాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు

లాస్‌ ఏంజిల్స్‌: అత్యంత భారీ కృష్ణబిలాన్ని అంతరిక్ష శాస్త్రవేత్తలు గుర్తించారు. 17 బిలియన్‌ సూర్యులు ఒదిగిపోయేంత పరిమాణంలో ఈ కృష్ణబిలం ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటి వరకు గుర్తించిన అతిపెద్ద కృష్ణబిలం సుమారు 10 బిలియన్‌ సూర్యుల పరిమాణంలో ఉంటుంది. కాలిఫోర్నియా బెర్కిలీ విశ్వవిద్యాలయం 2011లో కనుగొన్న ఈ కృష్ణబిలాన్ని అతిపెద్దదిగా గుర్తించి గిన్నిస్‌ బుక్‌లో నమోదు చేశారు. కొత్తగా కనుగొన్న కృష్ణబిలం ‘ఎన్‌జీసీ 1600’ కోమా క్లస్టర్‌కు వ్యతిరేక

పూరితో రోహిత్‌?

‘మాస్‌ హీరోగా నిలబడాలంటే పూరి జగన్నాథ్‌తో కనీసం ఓ సినిమా చేయాల్సిందే’ అనే మాటని మన హీరోలంతా నమ్ముతారు. అందుకే… పూరి అంటే కథానాయకులకు ఇప్పటికీ అంత క్రేజ్‌. తమలోని మాస్‌ యాంగిల్‌ని పూరి నూటికి నూరుపాళ్లూ బయటకు తీసుకొస్తాడని హీరోల నమ్మకం. ఇప్పుడు నారా రోహిత్‌ కూడా పూరి వైపు దృష్టిసారిస్తున్నాడట. ‘తుంటరి’, ‘సావిత్రి’ చిత్రాలతో మాస్‌ దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశాడు నారా రోహిత్‌. అయితే

స్పేస్‌-‘ఎక్స్‌’లెంట్‌..! అంతరిక్ష యానంలో మరో ముందడుగు

కాలిఫోర్నియా: అమెరికాకు చెందిన ప్రైవేటు స్పేస్‌ ఏజెన్సీ స్పేస్‌-ఎక్స్‌ చారిత్రక విజయం సాధించింది. మొదటిసారిగా స్పేస్‌-ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ను అట్లాంటిక్‌ మహా సముద్రంలోని డ్రోన్‌షిప్‌పై విజయవంతంగా ల్యాండ్‌ చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వస్తువులను మోసుకెళ్లిన ఈ రాకెట్‌ తిరిగి సురక్షితంగా సముద్రంపై లాంచింగ్‌ ప్యాడ్‌పై ల్యాండ్‌ అయ్యింది. డ్రోన్‌షిప్‌పై రాకెట్‌ను సురక్షితంగా ల్యాండ్‌ చేయడంలో స్పేస్‌-ఎక్స్‌ ఇప్పటికి పలుమార్లు విఫలమైంది. ఎట్టకేలకు ఇప్పుడు విజయం సాధించింది. నేలపై

ఆగస్టు 12న ‘మొహెంజోదారో’

ముంబయి: హృతిక్‌ రోషన్‌, పూజా హెగ్దే జంటగా రూపుదిద్దుకుంటున్న ‘మొహెంజోదారో’ చిత్ర షూటింగ్‌ పూరైంది. కథానాయకుడు హృతిక్‌ రోషన్‌ ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ.. ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రంతో తనకు మంచి స్నేహితులు ఏర్పడ్డారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నటి పూజా హెగ్దే, దర్శకుడు అశుతోష్‌ గోవారికర్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ఆగస్టు 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు.

ఐరాసలో తొలిసారిగా అంబేడ్కర్‌ జయంతి

యునైటెడ్‌ నేషన్స్‌: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125వ జయంతిని పురస్కరించుకుని తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలో వేడుకలు నిర్వహించనున్నారు. ఆయన జయంతికి ఒక రోజు ముందుగానే ఏప్రిల్‌ 13న ఈ వేడుకలు జరగనున్నట్లు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ వెల్లడించారు. కల్పనా సరోజ్‌, హ్యూమన్‌ హారిజాన్‌ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలోభారత శాశ్వత ప్రతినిధుల బృందం ఈ వేడుకలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా అసమానతలపై పోరాటం.. అభివృద్ధి

మే చివరి వరకు సమయం కావాలి: మాల్యా

ముంబయి: బ్యాంకుల నుంచి రూ.వేల కోట్లు అప్పుగా తీసుకొని చెల్లించకుండా విచారణ ఎదుర్కొంటున్న విజయ్‌ మాల్యా నేడు ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేటు (ఈడీ) ఎదుట గైర్హాజరయ్యారు. ప్రస్తుతం విచారణకు హాజరుకాలేనని ఆయన వెల్లడించారు. మే చివరి వరకు గడువు కోరారు. విచారణకు మే చివర్లో ఓ తేదీ నిర్ణయించమని అడిగారు. మాల్యా ప్రస్తుతం లండన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 9న విచారణకు హాజరుకావాలని ఇటీవల ఈడీ విజయ్‌ మాల్యాకు సమన్లు

హంద్రీనీవా సొరంగం పనులను పరిశీలించిన సీఎం

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన కొనసాగుతోంది. మదనపల్లి మండలం కోళ్లబయలు చేరుకున్న సీఎం.. హంద్రీనీవా ఎత్తిపోతల పథకం సొరంగం పనులను పరిశీలించారు. కాసేపట్లో హంద్రీనీవా ఎత్తిపోతల పథకం పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

వికలాంగులకు అన్ని రంగాల్లో శిక్షణ: వెంకయ్య

విజయవాడ: అంగవైకల్యం వచ్చిందని నిరాశవద్దు.. కేంద్రం చేయూత ఇస్తోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. శనివారం కృష్ణాజిల్లా ఉంగుంటూరు మండలం ఆత్కూరులో స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వికలాంగులకు చేయూత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. వికలాంగులకు మూడు చక్రాల వాహనాలు, కృత్రిమ కాళ్లు, వీల్‌ ఛైర్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సమాజంలో వికలాంగులకు అన్ని రకాల అవకాశాలు కల్పించాలని సూచించారు. వికలాంగుల కోసం దేశవ్యాప్తంగా వందలాది శిబిరాలు