BHARATH PROUD OF U DEVIKA SIROHI- HOME MINISTER RAJANADHSING

మీరట్ : ‘‘దేవిక సిరోహి… మీకు అభినందనలు. మీరు మీ కుటుంబం మాత్రమే కాకుండా, యావత్తు దేశం గర్వపడే విజయం సాధించారు’’ అని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. జీకా వైరస్‌ను విశ్లేషించిన అమెరికా బృందంలో మీరట్‌కు చెందిన దేవిక సిరోహి (29) సభ్యురాలు. జీకా వైరస్‌ను విశ్లేషించి, దాని నిర్మాణాన్ని వివరించడంలో ఈ బృందం విజయం సాధించిన నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ దేవికను ప్రశంసించారు. మీరు సాధించిన విజయం వల్ల బాలికా విద్యకు ఉన్న ప్రాధాన్యం స్పష్టంగా వెల్లడవుతోందన్నారు. బాలికలను రక్షించడంపైనా, బాలికలను చదివించడంపైనా మన దృష్టి ఉండాలన్నారు.
జీకా వైరస్ నిర్మాణ క్రమాన్ని వివరించిన బృందంలో ఉన్న నలుగురు విద్యార్థుల్లో దేవిక ఒకరు. ఈ బృందం ఇచ్చిన వివరణ వల్ల జీకా వైరస్ ద్వారా వచ్చే వ్యాధికి చికిత్సను కనుగొనడానికి అవకాశం ఉంటుంది. ఈ వైరస్ ప్రస్తుతం 38 దేశాల్లో వ్యాపించింది. దీని నివారణకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే ప్రాజెక్టులను ఇండియాతో సహా ఐదు దేశాలు చేపట్టాయి.devikasirohi
Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 + 3 =