ANDHRA PARIS IS READY FOR SRIRAMANAVAMI FESTIVAL

తెనాలి : శ్రీరామ నవమి ఉత్సవాలకు ఆంధ్రా ప్యారిస్‌ తెనాలి ముస్తాబవుతోంది. భద్రాచలం తర్వాత అంతటి స్థాయిలో శ్రీరామ నవమి వేడుకలను ఇక్కడ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. రెండో భద్రాద్రిగా పేరొందిన తెనాలిలో జరిగే వేడుకలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ నెల 15వ తేదీన జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి ఇప్పటినుంచే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలో ఎటుచూసినా చలువ పందిళ్లు దర్శనమిస్తున్నాయి. వేడుకల్లో భాగంగా వసంత నవరాత్ర కల్యాణోత్సవాలతో పాటు రోజూ ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

నవమి ఉత్సవాలకు ప్రత్యేక విశిష్టత
పట్టణంలోని గాడి బావి సెంటర్‌లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఎన్నో ఏళ్లుగా నవమి ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ దేవస్థానం 1919లో నిర్మించారు. దేవస్థానం నిర్మించక ముందు ఇక్కడ రోజూ సాయంత్రం భజనలు చేసేవారు. ఆనాటి బ్రిటీష్‌ ప్రభుత్వం దీనికి అనుమతించలేదు. పెద్దలంతా కలిసి ఒకే మాటపై నిలబడి ఒకరోజు రాత్రి దేవస్థానం నిర్మాణం మొదలుపెట్టి తెల్లవారే లోపు ప్రతిష్ఠా కార్యక్రమం కూడా పూర్తి చేశారని చెబుతారు. అర్ధరాత్రి పూట ప్రతిష్ట జరిగినందున ఈ ఆలయానికి దొంగరాముడి గుడి అనే పేరు వచ్చినట్లు ప్రతీతి. ఇక్కడి స్వామి వారు భద్రాచలంలో మాదిరిగానే శ్రీ సీతారామ చంద్రమూర్తి ఏకశిలపై ఆశీనులుగా ఉండటంతో ఈ ప్రాంతానికి రెండో భద్రాదిగా పేరు వచ్చింది. ఈ దేవాలయంలో సిద్ధి గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ప్రసన్నాంజనేయస్వామి ఉప ఆలయాలు ఉన్నాయి. ఈ దేవస్థానం మూడు గాలి గోపురాలతో కూడుకుని జిల్లాలోనే ప్రసిద్ధి గాంచింది. ఈ ఏడాది ఇక్కడ సీతారామ కల్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గాడిబావి సెంటర్‌ నుంచి గాంధీ చౌక్‌ వరకు మెయిన్‌ రోడ్డు పొడవునా భారీ ఎత్తున చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. కల్యాణోత్సవం అనంతరం ఇక్కడ తిరునాళ్ల జరుగనుంది.
హనుమాన్‌ చౌక్‌లో..
బోస్‌రోడ్డులోని హ నుమాన్‌చౌక్‌లో శ్రీసీతారాముల మం ది రం వద్ద కూడా శ్రీరామనవమి ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 84వ వసంత నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఉత్సవాలలో భా గంగా శ్రీ సీతారాముల కళ్యాణం, శ్రీ సీతారామ పాదుకా పట్టాభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా మం దిరం ఎదుట చలువ పందిళ్లతో అలంకరించారు.097

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

− 5 = 2