WAGES FOR A WORKER IS BETTER THEN AN ENGINEER

  • ఎంబిఎలతో సమానంగా జీతాల్లో పోటీ
న్యూఢిల్లీ: కొలువుల మార్కెట్లో కొత్త ట్రెండ్‌ ప్రారంభమైంది. అత్యధిక జీతాలు అందుకోవడంలో ఇప్పటి వరకు ముందున్న ఇంజనీరింగ్‌, ఎంబిఎ గ్రాడ్యుయేట్లు నిపుణులైన కార్మికుల ముందు వెలవెలబోతున్నారు. ఇంజనీర్లతో పోలిస్తే నిపుణులైన కార్మికులకు కంపెనీలు 10 నుంచి 27 శాతం జీతాలు అధికంగా ఆఫర్‌ చేస్తున్నాయని ‘టీమ్‌లీజ్‌’ సంస్థ సోమవారం విడుదల చేసిన ఒక సర్వే పేర్కొంది. వీరి జీతాలు ఇంచుమించు మేనేజ్‌మెంట్‌ పట్టభద్రులతో సమానంగా ఉన్నాయి. కంపెనీలు డిగ్రీలకంటే నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఆటోమొబైల్‌ రంగం లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. డిమాండ్‌కు తగ్గట్టు నిపుణులైన కార్మికులు లభించక పోవడం ఇందుకు ప్రధాన కారణమని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రీతుపర్ణ చక్రవర్తి చెప్పారు. ఇంజనీర్ల లభ్యత డిమాండ్‌కు మించి ఉండడం, మళ్లీ వారిలో సరైన నైపుణ్యాలు లేకపోవడం, నిపుణులైన కార్మికులు పరిమిత స్థాయిలోనే లభించడం కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయన్నారు.
ఆటోమొబైల్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్నియల్‌ సేవలు, బీమా రంగం, నిర్మాణ రంగం, ఎలక్ర్టానిక్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, జెమ్స్‌ అండ్‌ జువెలరీ, హెల్త్‌కేర్‌, లైఫ్‌ సైన్సెస్‌, లాజిస్టిక్స్‌, రిటైల్‌, ట్రావెల్‌, టూరిజం రంగాలను పరిశీలించి టీమ్‌లీజ్‌ సంస్థ ఈ సర్వే రూపొందించింది. అపెరల్‌ రంగంలో అడ్వాన్స్‌ ప్యాటర్న్‌ మేకర్‌, ఆటోమొబైల్‌ రంగంలో సర్వీస్‌ సూపర్‌వైజర్లు, జెమ్స్‌ అండ్‌ జువెలరీ రంగంలో మాస్టర్‌ మేకర్ల జీతాలు ఎంబిఎ మార్కెటింగ్‌, హెచ్‌ఆర్‌ మేనేజర్లతో సమానంగా ఉన్నాయి. దీంతో ముందు ముందు ఎక్కువ మంది యువకులు ఫ్యాక్టరీల్లో కార్మికులుగా చేరేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని టీమ్‌లీజ్‌ సంస్థ అంచనా వేసింది.
రంగాల వారీగా
గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా కొత్తగా 9 లక్షల ఉద్యోగాలు ఏర్పడితే అందులో అత్యధికంగా 57 శాతం కొలువులు ఐటి రంగంలో ఏర్పడ్డాయని అసోచామ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ బ్యూరో (ఎఇఆర్‌బి) తెలిపింది. తర్వాత సేవల రంగం (19 శాతం) ఉత్పత్తి రంగం (11 శాతం) అత్యధికంగా కొత్త కొలువులు వచ్చి చేరాయి. ఇదే కాలంలో బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ సేవల రంగం, బీమా (బిఎ ఫ్‌ఎ్‌సఐ) రంగాల్లో కేవలం ఎనిమిది శాతం ఉద్యో గాలు మాత్రమే ఏర్పడ్డాయి. నిర్మాణ, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మరో 3.5 శాతం ఉద్యోగాలు వచ్చాయి. కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన కొలువుల్లో 65 శాతం కొలువులు ఐటి, ఐటి ఆధారిత సేవల (ఐటి ఐటిఈస్‌) రంగంలో ఏర్పడ్డాయి. నాలుగో త్రైమాసికంలో వచ్చిన ఐదు లక్షలకు పైగా ఐటి ఐటిఈస్‌ ఉద్యోగాల్లో కర్ణాటక వాటా 28 శాతం ఉంది. మహారాష్ట్ర (20.5 శాతం), తమిళనాడు (11 శాతం), ఆంధ్ర-తెలంగాణ (10 శాతం), ఉత్తర ప్రదేశ్‌ (8 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సేవలు, ఉత్పత్తి రంగాలకు సంబంధించిన కొత్త ఉద్యోగాల కల్పనలో మహారాష్ట్ర దేశంలోనే ముందుంది. రెండు తెలుగు రాష్ట్రాలు సేవల రంగానికి చెందిన కొత్త ఉద్యోగాల కల్పనలో ఐదో స్థానం, ఉత్పత్తి రంగానికి చెందిన ఉద్యోగాల విషయంలో నాలుగు స్థాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాయి.
నాలుగో స్థానంలో తెలుగు రాష్ట్రాలు

ఈ సంవత్సరం జనవరి-మార్చిలో దేశీయంగా కొత్త కొలువుల కల్పనలో రెండు తెలుగు రాష్ట్రాలు నాలుగో స్థానంలో నిలిచాయి. ఈ మూడు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో 82,000 కొత్త ఉద్యోగాల కల్పన జరిగిందని అసోచామ్‌ ఆర్థిక పరిశోధనా బ్యూరో (ఎఇఆర్‌బి) సోమవారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక ఈ విషయంలో ముందుంది. జనవరి-మార్చి, 2016 మధ్య కాలంలో దేశంలో ఏర్పడిన కొత్త కొలువుల్లో 2.16 లక్షలు (24 శాతం) ఉద్యోగాలు కర్ణాటకలో వచ్చాయి. కర్ణాటక తర్వాత మహారాష్ట్ర రెండు లక్షలు, (23 శాతం), తమిళనాడు 93,000 (10.5 శాతం) కొత్త కొలువుల కల్పనలో ముందున్నాయి. 72,000 ఉద్యోగాలతో హరియాణా ఐదో స్థానంలో నిలిచింది.A_worker_is_seen_a_3583234b

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

91 − = 84