YCP WALKOUT

కరువు మండలాలను సత్వరంగా ప్రకటించడంలో ప్రభుత్వం అలసత్వం వహించిందని వైసీపీ ఆరోపించింది. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో పలువురు వైసీపీ సభ్యులు ఇదే అంశంపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అక్టోబర్‌లో కరువు మండలాలను ప్రకటించాల్సి ఉందని అయితే వరదల సమయంలో కరువు మండలాలు ప్రకటించారని ప్రతిపక్ష నేత జగన్ మండిపడ్డారు. జిల్లాలకు చాలీచాలని నీటి కేటాయింపులు చేస్తున్నారన్నారు. అయితే కరువుపై ప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదంటూ సభ నుంచి వైసీపీ వాకౌట్ చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు.

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

− 2 = 2