kohli cross dhoni in renumaration

విరాviratట్ కోహ్లీ. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల మధ్య చర్చకొస్తున్న పేరు ఇది. పాక్‌పై అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగిన కోహ్లీకి పాకిస్థాన్‌లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా పెరిగిపోయిందట. ఇంతటి క్రేజ్ తెచ్చుకున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు మరో రికార్డ్ బ్రేక్ చేశాడు. పారితోషికం విషయంలో ఈ యువ ఆటగాడు కెప్టెన్ ధోనీని కూడా వెనక్కు నెట్టేశాడు. తమ కంపెనీ బ్యాట్‌ను వినియోగించినందుకు స్పార్టన్ సంస్థ ధోనీకి 6 కోట్లు చెల్లిస్తోంది. ఇప్పుడీ రికార్డు‌ను కోహ్లీ అధిగమించాడు. ఎమ్‌ఆర్‌ఎఫ్ కంపెనీ తమ బ్యాట్‌తో ఆడుతున్నందుకు కోహ్లీకి 8 కోట్ల రూపాయలను చెల్లిస్తోంది. వీరి తర్వాత స్థానాల్లో క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, శిఖర్ ధావన్ ఉన్నారు.

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

− 5 = 1