Metro Rail Project Working fast at Vijayawada

 నగరంలో మెట్రో రైల్‌ ప్రాజెక్టు పనుల్లో కాలహరణం నివారించి, 2018 నాటికి పూర్తి స్థాయిలో కారిడార్‌ – 2 పనులను పూర్తి చేయాలన్న తలంపుతో అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ) వ్యవహరిస్తోంది. మరో నాలుగు నెలల్లో ప్రాజెక్టుకు ఫైనల్‌ అప్రూవల్‌ తెచ్చుకోవాలని భావిస్తోంది. ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి ఢిల్లీ వెళ్ళి వివిధ కేంద్ర సంస్థలు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించి మార్గాన్ని సుగమం చేసి ఆదివారం హైదరాబాద్‌ బయలుదేరి వచ్చారు. దేశంలో కేటాయించిన మెట్రో ప్రాజెక్టులకు సంవత్సరం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఫైనల్‌ అప్రూవల్‌ ఇస్తుంది. ఈ జాప్యాన్ని తగ్గించి తొమ్మిది నెలల్లో పైనల్‌ అప్రూవల్‌ తెచ్చుకోవటానికి ఏఎంఆర్‌సీ కృషి చేస్తోంది. విజయవాడలో 26 కిలోమీటర్ల నిడివి కలిగిన ప్రతిపాదిత రెండు కారిడార్లను 2018 నాటికల్లా ఎట్టి పరిస్థితులలోనూ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏఎంఆర్‌సీ, డీఎంఆర్‌సీలకు గట్టిగా చెబుతోంది. సాధారణంగా మెట్రో ప్రాజెక్టుల పనులు ప్రారంభించిన తర్వాత పూర్తి చేయాలంటే కనీసం నాలుగున్నర సంవత్సరాలు పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏఎంఆర్‌సీ, డీఎంఆర్‌సీ అధికారులు ముందస్తుగా ఆపరేషన యాక్షనప్లానను సిద్ధం చేసుకున్నారు. ఇటీవల కారిడార్‌ – 2 (పీఎనబీఎస్‌ – రైల్వేస్టేషన – ఏలూరు రోడ్డు – నిడమానూరు) వరకు పనులకు సంబంధించి టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలో 10 బడా సంస్థలు పాలు పంచుకున్నాయి. టెండర్లను ఖరారు చేయటానికి మూడు నెలల సమయం ఉంది. అవసరమైతే మరో నెల పొడిగించే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే కారిడార్‌ – 1 (పీఎనబీఎస్‌ – బందరు రోడ్డు – పెనమలూరు సెంటర్‌ వరకు) టెండర్ల నోటిఫికేషనను సిద్ధం చేశారు. వెంటనే టెండర్లు పిలిస్తే.. ఏ కారణంగానైనా పనుల్లో జాప్యం జరిగితే ఇబ్బందులు ఎదురు కాకూడదని నోటిఫికేషన వెలువరించకుండా ఆగారు. అప్రూవల్‌ వచ్చిన వెంటనే బందరు రోడ్డు కారిడార్‌ టెండర్లు పిలవనున్నారు.
నగరంలో జైకా సంస్థ సర్వే
మెట్రో రైల్‌ కారిడార్‌ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున రుణ సహాయాన్ని అందించటానికి ముందుకు వచ్చిన జపాన ఆర్థిక సంస్థ ‘జైకా’ కు సంబంధించిన ద్విసభ్య సర్వే బృందం ఈ నెల 18న విజయవాడ వస్తుంది. ఈ బృందం నగరంలోని కారిడార్ల స్థితిగతులపై క్షేత్రస్థాయిలో అద్యయనం చేస్తారు. ఆ తర్వాత 18 మంది సభ్యులు కలిగిన రెండో బృందం నగరానికి వస్తుంది. సాంకేతిక అంశాలపై ఈ సంస్థ అధ్యయనం చేస్తుంది. రెండు బృందాలు వేర్వేరుగా జైకా సంస్థ ఉన్నతాధికారులకు నివేదికలను ఇస్తాయి. జైకా సంస్థ నుంచి దాదాపు రూ. 3600 కోట్లను రుణంగా తీసుకోవాలని డీఎంఆర్‌సీ భావిస్తున్న సంగతి తెలిసిందే. జైకా సంస్థ 0.3 శాతం వడ్డీకి భారీ స్థాయిలో రుణం ఇవ్వటానికి ఇప్పటికే అంగీకరించింది. అయితే క్షుణ్ణంగా అధ్యయనం చేయటానికి నగరానికి సర్వే బృందాలను పంపుతోంది.

metro

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 + = 27