Tamil Naidu Government Restricts foods in Schools

  • పాయసం, హల్వాలను అనుమతి 
తమిళనాడు: పాఠశాల క్యాంటీన్లలో జిలేబీ, చిప్స్‌ వంటి తినుబండారాలను విక్రయించడాన్ని అధికారులు నిషేధించారు. పాయసం, హల్వాలకు అనుమతులు జారీచేశారు. కేంద్ర మహిళా అభివృద్ధి, పిల్లల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలల్లో క్యాంటీన, ఆహార పదార్థాలు, విద్యార్థుల ఆరోగ్యంపై తనిఖీలు నిర్వహించారు. పాఠశాల క్యాంటీన్లలో విద్యార్థులకు అనారోగ్యం కలిగించే ఆహార వస్తువులు విక్రయించడం, ఇళ్లలో అలాంటి వస్తువులనే తల్లిదండ్రులు కొనివ్వడం ఈ తనిఖీల్లో తెలిసింది. దీంతో ఆ బృందం పాఠశాలలకు, తల్లిదండ్రులకు ఆహారవస్తువుల గురించి కొన్ని సూచనలు చేసింది. ఆ వివరాలు…
 

నిషేధించిన ఆహారవస్తువులు…

బంగాళా దుంపలు, ఇతర చిప్స్‌, రసగుల్లా, గులాబ్‌జామ్‌, కలకండ, న్యూడిల్స్‌, పిజ్జా బర్గర్‌, టిక్కా, అన్ని రకాల చూయింగ్‌ గమ్‌లు, మిఠాయిలు తదితరాలతో పాటు చక్కెర 30 శాతానికి పైగా కలిసిన జిలేబీ, బూందీ, బ్లాక్‌ చాక్లెట్‌, శీతల పానీయాలు, బిస్కెట్లు, బమ్‌ బటర్‌జామ్‌, జెల్లీ రకాలను వినియోగించకూడదు.
 

సిఫార్సు చేయబడిన ఆహారవస్తువులు…

కూరగాయలు కలిసిన గోధుమ పరోటా, రోటీ, అన్నం, పలావు, పప్పు రకాలు, గోధమ హల్వా, నల్ల బఠానీ శనగలు, గోధుమ ఉప్మా, కూరగాయల రకాల కిచిడీ, సాంబారు రైస్‌, ఇడ్లీ, వడ, కీర్‌ పాయసం, పాల పానీయాలు, కూరగాయల ఉప్మ, శాండ్‌విజ్‌, పకోడ, సమోసా వంటి పోషన పధార్థాలు కలిగిన ఆహారవస్తువులను తయారుచేసి వారానికి ఒకసారి మాత్రమే పాఠశాలల క్యాంటీన్లలో అందచేయాలి. చేపలు, కొవ్వు తక్కువగా వున్న మాంసం, గుడ్లు, ధాన్యంతో తయారుచేసిన ఆహారపధార్థాలు, పండ్ల రసాలు విద్యార్థులకు అందించాలి.
 

వ్యాయామ శిక్షణ తప్పనిసరి…
విద్యార్థులను వీలైనంత వరకు అప్పుడప్పుడు వాకింగ్‌కు వెళ్లేటట్టు చూడాలి. ఈత, ఫుట్‌బాల్‌ వంటి ఆటలతో పాటు యోగా, వ్యాయామం శిక్షణ పాల్గొనేటట్లు ప్రోత్సహించాలి. విద్యార్థులు సైకిల్‌పై పాఠశాలకు వచ్చేలా వారిని ప్రోత్సహించాలి.

Awadhi_jalebi

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

72 − 62 =