V.V.S. Laxman Wonderful Inning

  • లక్ష్మణ్‌ ఇన్నింగ్స్‌కు పట్టాభిషేకం
  • టాప్‌-50లో సచిన్‌కు దక్కని చోటు

ముంబై: ఈడెన్‌ గార్డెన్స్‌లో వీవీఎస్‌ లక్ష్మణ్‌ (281) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ గడచిన అర్ధ శతాబ్దపు అత్యుత్తమ ప్రదర్శనగా గౌరవం అందుకుంది. ఈఎ్‌సపీఎన్‌ డిజిటల్‌ మ్యాగజీన్‌ కోసం సహచర ఆటగాళ్లు, కామెంటేటర్లు, జర్నలిస్టులతో నిర్వహించిన పోలింగ్‌లో టాప్‌-50 ప్రదర్శనల్లో లక్ష్మణ్‌ ఇన్నింగ్స్‌ ‘ది బెస్ట్‌’ అని ఓట్‌ చేశారు. కోల్‌కతాలో జరిగిన టెస్ట్‌లో ఆసే్ట్రలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేయగా.. భారత 171 రన్స్‌కే ఆలౌటై 274 పరుగులతో వెనుకబడింది. కానీ ఫాలోఆన్‌ ఆడిన భారత.. లక్ష్మణ్‌ వీరోచిత బ్యాటింగ్‌ కారణంగా 657 పరుగులు చేసింది. ఆసే్ట్రలియాను 212 పరుగులకే అవుట్‌ చేసి 171 పరుగులతో చారిత్రక విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 59 పరుగులు చేసిన లక్ష్మణ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు జరిగి వన్‌ డౌన్‌లో దిగాడు. ఐదో వికెట్‌కు ద్రావిడ్‌ (180)తో కలసి 376 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆసే్ట్రలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ వీవీఎస్‌ ఆడిన తీరును గుర్తు చేసుకున్నాడు. ‘ఆ మ్యాచ్‌లో లక్ష్మణ్‌ బౌలింగ్‌ చేయడం ఎంతో కఠినంగా అనిపించింది. అన్ని బంతులను కవర్స్‌ లేదా మిడ్‌ వికెట్‌ మీదుగా ఆడాడ’ని వార్న్‌ ప్రశంసించాడు. లెగ్‌ సైడ్‌ దిశగా వీవీఎస్‌ ఆడిన షాట్లు ఆశ్చర్యపోయేలా చేశాయని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ చెప్పాడు. రెండు రోజులపాటు బౌలింగ్‌ చేసినా లక్ష్మణ్‌ను అదుపుచేయలేక పోయామన్నాడు. ఆ టెస్ట్‌ సమయంలో వెన్ను నొప్పిని భరించలేక వీవీఎస్‌ నేలపై పడుకున్నాడని అతడి రూమ్‌మేట్‌, మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ గుర్తు చేసుకున్నాడు. ఇదిలావుండగా టాప్‌-50 జాబితాలో సచిన్‌ పేరు లేకపోవడం విస్మయం కలిగించింది. టాప్‌-50 జాబితాలో వెస్టిండీస్‌ దిగ్గజం లారా.. అత్యధికంగా నాలుగు ఎంట్రీలు సాధించాడు. ఓవరాల్‌గా నాలుగో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ ఇయాన్‌ బోథమ్‌కు మూడు ఎంట్రీలు లభించాయి. ఓవల్‌లో 1976లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 14 వికెట్లు తీసిన మైకేల్‌ హోల్డింగ్‌ ప్రదర్శనకు మూడో స్థానం లభించింది. మొత్తం మీద యాభైలో విండీస్‌ ఆటగాళ్లకు 14 ఎంట్రీలు లభించడం విశేషం.

VVS

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

64 + = 69