Ganta Srinivasa Rao Inaugurated Visakha Utsav Celebrations

విశాఖ కేంద్రంగా మూడు రోజులపాటు నిర్వహించే విశాఖ ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. 2014 అక్టోబరులో హుద్‌హుద్‌ తుపాను సృష్టించిన బీభత్సం నేపథ్యంలో ప్రజల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలపై గత ఏడాది జనవరిలో విశాఖ ఉత్సవాలను నిర్వహించారు. వీటిని ఏటా జరపాలన్న ముఖ్యమంత్రి సూచనపై ఈఏడాది కూడా ఉత్సవాలకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. శుక్రవారం ఉదయం వుడా పార్కులో పుష్ప ప్రదర్శనను మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. నగరంలోని ఆర్కేబీచ్‌, వుడా పార్కు, మధురవాడలోని జాతరలో మూడు వేదికలు ఏర్పాటు చేసి.. రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఆర్కేబీచ్‌లోని ప్రధాన వేదిక ప్రారంభ సభలో మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.ముఖ్యమంత్రి శనివారం నాటి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయన ఆర్కేబీచ్‌ ప్రధాన వేదిక నుంచి విశాఖ ప్రజలనుద్దేశించి ప్రసంగించేలా ఏర్పాట్లు చేశారు. ఆదివారం నాటి ముగింపు సభకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.

utsav

 

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

85 − = 82