Andhra Pradesh to tie-up with Microsoft – Satya Nadella Promises development of A.P

మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం రాష్ట్ర ప్రగతిలో కీలకం
ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

 హైదరాబాద్‌: మైక్రోసాఫ్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌ ఒప్పందం రాష్ట్ర ప్రగతిలో కీలకమని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. భవిష్యత్తు అవసరాలను అంచనావేస్తూ పౌర కార్యక్రమాలను నిర్వహించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యమంత్రి ఐటీ సలహాదారుగా జేఏ చౌదరిని నియమించనున్నట్లు వెల్లడించారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఐటీరంగానికి వంద ఎకరాలు కేటాయిస్తున్నామని వివరించారు. సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతి, తిరుపతిల్లో ఐటీ, ఎలక్ట్రానిక్‌ రంగాల అభివృద్ధికి చెరో వెయ్యి ఎకరాల చొప్పున స్థలాలు కేటాయించనున్నామన్నారు. అనంతపురంలో రాగమయూరి ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. దీనిద్వారా రాష్ట్రానికి రూ.రెండు వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, పది వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో స్మార్ట్‌పల్స్‌ సర్వే నిర్వహించేందుకు క్షేత్రస్థాయి అధికారులకు లక్ష ట్యాబ్‌లు పంపిణీ చేశామని, దీనిపై అధికారులకు శిక్షణ పూర్తయ్యాక సర్వే నిర్వహిస్తామని తెలిపారు. విద్య, వైద్యం, పౌరసేవలు, మిషన్‌ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం ఫైబర్‌గ్రిడ్‌ ద్వారా ఇంటింటికీ పది ఎంబీపీఎస్‌ సామర్థ్యంతో కూడిన బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందించే ప్రాజెక్టును మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల అభినందించారన్నారు. విద్యుత్తు స్తంభాల మీదుగా వేస్తున్న ఈ కేబుళ్ల ద్వారా సేవలు ఏప్రిల్‌ నుంచి ప్రారంభిస్తామని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ-ప్రగతి కార్యక్రమానికి సాయం చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ ముందుకు వచ్చిందని వివరించారు. చెన్నై, బెంగళూరు తరువాత ఐటీలో హైదరాబాద్‌ను అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిచేశారని సీఈవో నాదెళ్ల తెలిపారని పేర్కొన్నారు.

palle

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

60 + = 69