టాపర్ లిస్ట్ లో రానా

టాప్ 50 ఏసియన్ సెక్సీయస్ట్ మెన్ లిస్ట్‌లో రానా
బాహుబలి, రుద్రమదేవి విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న రానా అదే జోష్‌లో ఇప్పుడు వరుస సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నాడు. ప్రస్తుతం బాహుబలి-2 షూటింగ్‌కు రెడీ అయిన రానా ఖాతాలోకి తాజాగా ఓ అరుదైన రికార్డ్ వచ్చి చేరింది. ఆసియాలో ఉన్న టాప్ 50 సెక్సీయస్ట్ మెన్ లిస్ట్‌లో చోటు దక్కించుకొని తన సత్తాని మరోమారు నిరూపించుకున్నాడు రానా. ఇంగ్లాండ్‌కు చెందిన ఈస్ట్రన్ ఐ అనే పత్రిక వారు నిర్వహించిన ఈ ఆన్ లైన్ పోలింగ్‌లో రానా 29వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ జాబితాలో ఉన్న కొంతమంది క్రేజీ హీరోల్ని పక్కనపెట్టి మరీ రానాకు పట్టంకట్టారు నెటిజన్లు. దీంతో బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ, సింగర్ అర్జున్, అతిఫ్ అలీ వంటి హ్యాండ్‌సమ్ సెలెబ్రిటీస్ కంటే మెరుగైన స్థానాన్ని దక్కించుకున్నాడు రానా. ఇదే పోలింగ్‌లో హృతిక్‌కు సెకండ్ ప్లేస్ దక్కింది, బాద్‌షా షారుఖ్ ఖాన్ 9వ పొజిషన్‌లో నిలివగా… రణ్ బీర్ కపూర్‌కు 12 వ స్థానం దక్కింది.
ఇదిలా ఉంటే రానా ప్రస్తుతం ‘బాహుబలి-2’తో పాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఓ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ మూవీలో రానా సరసన హాట్ బ్యూటీ రెజీనా కనిపించబోతోంది. ఇక బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బెంగుళూరు డేస్ రీమేక్‌లో కూడా రానా నటిస్తున్నాడు. ఇదే మూవీలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో రానాకి జోడిగా సమంత నటిస్తోంది. అలాగే రానా హీరోగా రాణిస్తూనే యాడ్ ఫీల్డ్‌లోనూ దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. యాడ్స్‌లో నటించడం వల్ల ఇండియావైడ్‌గా పాపులారిటీ వస్తోందని… అలా వచ్చిన గుర్తింపుతో తన మార్కెట్ పరిధి పెంచుకోవచ్చనే ఆలోచనలో ఈ టాల్ హంక్ ఉన్నాడని సమాచారం

 

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

61 + = 70