బాదను మరిచి వృత్తి తలచిన దేవిశ్రీ

ఎప్పుడూ చిందులేస్తూ గోల గోల చేసే దేవిశ్రీని తండ్రి సత్యమూర్తి హఠాన్మరణం ఒక్కసారిగా కృంగదీసింది…. ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం సంగీత దర్శకుడిగా పుల్ బిజీగా ఉన్నాడు. ఐతే తండ్రి మరణంతో దేవి కమిటైన సినిమాలు అనుకున్న టైమ్‌కు విడుదల కావనే అందరూ భావించారు..కానీ దేవిశ్రీ వృత్తిపై తనకున్న అంకిత భావాన్ని ప్రదర్శించాడు. దేవి ఇంత బాధలోనూ వృత్తి ధర్మాన్ని మరవకుండా… తన నిర్మాతలకు నష్టం వాటిల్ల కూడదనే తపనతోనూ భాధ్యతతోనూ ఒప్పుకున్న సినిమాలను అనుకున్న టైమ్‌కి పూర్తి చేయటానికి రెడీ అవుతున్నాడట. ముందుగా ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో చిత్రానికి సంబంధించిన రీరికార్డింగ్ వర్క్‌ను కంప్లీట్ చేయబోతున్నాడు దేవీ… నిజానికి దేవి పరిస్థితి గమినించి ఈ చిత్రాన్నివాయిదా వేసేందుకు సిద్ధమైయ్యారు దర్శకుడు సుకుమార్, నిర్మాత బివియస్ ఎన్ ప్రసాద్…. అయితే తన కారణంగా సినిమా వాయిదా పడటం ఇష్టం లేని దేవి దు:ఖాన్ని అణుచుకుని అనుకున్న ప్రకారమే పూర్తి చేస్తున్నట్లు సమాచారం…

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

93 − 90 =