కూటి కోసం కోటి విద్యలలో…?

బతుకు చిత్రాలు బహు విచిత్రంగానూ, కొంత బాధను కలిగించే విధంగానూ ఉంటాయి. భిక్షగాళ్లు, బొమ్మలమ్ముకునే వాళ్లు, పిల్లలను చంకన ఎత్తుకుని రూపాయి కోసం జాలిగా చూసే తల్లులు, పాములను ఆడించే వాళ్లు ఇలా ఎన్నో హృదయవిదారక దృశ్యాలు మన కళ్ల ముందు కదలాడుతూ ఉంటాయి. అయితే పాకిస్థాన్‌లో పాములను ఆడించే వ్యక్తి ఏకంగా బతికున్న పామును ముక్కులోంచి లోపలకు పంపించి, నోట్లోంచి బయటకు తీశాడు. దీంతో అవాక్కవడం అక్కడున్నవారి వంతైంది. ఇప్పుడీ వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.
పాకిస్థాన్‌కు చెందిన ఇక్భాల్ జోగి(30) వీధుల వెంట పాములను ఆడించుకుంటూ బతుకీడుస్తుంటాడు. ఇతను ఎంత ఫేమస్సంటే, పెళ్లిళ్లకు కూడా ఇతనిని పిలిపించి పాములాట ఆడిస్తారు అక్కడి గ్రామస్థులు. ఇతను మాత్రమే కాదు. ఇతని సంతానమైన 8 మంది పిల్లలు కూడా గత 12 సంవత్సరాలుగా ఈ విన్యాసాన్నే వృత్తిగా ఎంచుకున్నారు. వారి కట్టు, బొట్టు అంతా సాంప్రదాయకంగా ఉంటాయి. ఈ వృత్తిని ఎంచుకోవడంపై ఇక్భాల్ మాట్లాడుతూ తాను ఈ విన్యాసం చేసినప్పుడల్లా 5 పౌండ్లు సంపాదిస్తున్నానని చెప్పాడు. అంతేకాదు దేవుడు ఎవరికీ ఇవ్వని టాలెంట్ తన కుటుంబానికి ఇవ్వడం గర్వంగా ఉందని మురిసిపోతున్నాడు.
Snake
Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

82 − = 81