కల్తీ మద్యం వెనుక కేటుగాల్లు ఎవరు?

  • బడా వ్యాపారులే అసలు సూత్రధారులు
  • అమ్మకం ఎక్కువగా ఉన్న బ్రాండ్లపైనే వ్యాపారుల దృష్టి
  • ముధోల్‌ కేంద్రంగా కల్తీ దందా…..
  • కళ్లు మూసుకుంటున్న ఎక్సైజ్‌, పోలీస్‌ యంత్రాంగం

 

జిల్లాలో కల్తీ మద్యం రాకెట్‌ జడలు విప్పుతోంది. బడా వ్యాపారులే ఈ కల్తీ మద్యం రాకెట్‌కు సూత్రదారులుగా నిలుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో అనుభవం ఉన్న కొందరు సీనియర్‌ మద్యం వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి ఈ కల్తీ రాకెట్‌ ను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారన్న ఫిర్యాదులున్నా యి. అయితే ఈ వ్యాపారులు తమ కల్తీ సామ్రాజ్యాన్ని నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలకు సైతం విస్తరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం అమ్మకాలు ఎక్కువగా సాగే ప్రాంతాలనే ల క్ష్యంగా చేసుకొని ఈ కల్తీ మద్యం వ్యాపారులు తమ దందాను సాగిస్తున్నారు.
వినియోగదారులు ఎక్కువగా వినియోగించే మద్యంను వీరు కల్తీ చేస్తూ మందుబాబులను బురిడి కొట్టిస్తున్నారు. ఈ కల్తీ దందా ద్వారా కోట్ల రూపాయలను ఆర్జిస్తున్న వ్యా పారులు ఎక్సైజ్‌ అధికారులను సైతం శాసిస్తున్నా రు.
ఆదిలాబాద్‌, నిర్మల్‌, భైంసా, మంచిర్యాల, బెల్లంపల్లి, తాండూరు, శ్రీరాంపూర్‌, రామకృష్ణాపూర్‌, కాగజ్‌నగర్‌, ఉట్నూర్‌, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌ చోట్ల కల్తీ మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ కల్తీ మద్యం దందా ఏళ్ల నుంచి కొనసాగుతున్నప్పటికీ అధికారులు ఎలాంటి తనిఖీలు చేపట్టక పోవడం అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా బెల్టు షాపులను లక్ష్యంగా చేసుకొని ఈ కల్తీ మద్యం సరఫరాను కొనసాగిస్తున్నారు. ఇటీవల నిర్మల్‌, ముథోల్‌ తదితర ప్రాంతాల్లో కల్తీ మద్యం విక్రయాలు జరుపుతున్న మద్యం దుకాణాలపై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడి చేసి కల్తీ మద్యంను గుర్తించడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. జిల్లాలోని అన్ని ఎక్సైజ్‌స్టేషన్ల పరిధిలో అధికారులు మద్యం దుకాణాలపై ఎలాంటి తనిఖీలు చేపట్టక పోవడంతోనే ఈ కల్తీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ కల్తీ మద్యం రాకెట్‌ వెనుక కొంత మంది ప్రజాప్రతినిధుల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారి అండ దండలతోనే కల్తీ వ్యాపారాన్ని దర్జాగా కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఎక్కువగా వినియోగంలో ఉన్న మద్యం బ్రాండ్లను లక్ష్యంగా చేసుకొని కల్తీ దందాను సాగిస్తున్నారు. చీఫ్‌ లిక్కర్‌తోపాటు ఎక్కువ వినియోగంలో ఉన్న రాయల్‌స్టాగ్‌, బ్లాండర్‌స్ర్పైడ్‌, పీసీ, సిగ్నేచర్‌, ఏసీ ప్రిమియం లాంటి బ్రాండ్‌ విస్కీలను కల్తీ చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని కర్ణాటక, తమిళనాడులోని డిస్టిల్లరీస్‌ నుంచి స్పిరిట్‌ తీసుకు వచ్చి కొన్ని రసాయనాలను కలిపి ఈ కల్తీ మద్యంను తయా రు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ తయారీ కేంద్రాలు ఊరికి దూరంలో ఉన్న పం ట చేన్లలోను అలాగే కొన్ని ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక్కడి నుంచే కల్తీ మద్యంను బాటిళ్లలో ప్యాక్‌ చేసి తమకు అనుకూలమైన మద్యం దుకాణాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో జోరుగా దందా
కాగా జిల్లాలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ కల్తీ మద్యం విక్రయాలు భారీ ఎత్తున సాగుతున్నాయి. కోల్‌బెల్ట్‌ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని వ్యాపారులు కల్తీ మద్యంను భారీ ఎత్తున విక్రయిస్తున్నారు. అలాగే నిర్మల్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల్‌ తదితర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా బెల్ట్‌ షాపు లు ఉన్నందున ఆ ప్రాంతాల్లో కల్తీ మద్యాన్ని దర్జా గా విక్రయిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని ఎక్సైజ్‌ అధికారులతో సదరు వ్యాపారులు సన్నిహిత సంబంధా లు పెట్టుకొని తమ దందాకు అడ్డు లేకుండా చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి.
ఈ కల్తీ మద్యం వ్యాపారుల రాకెట్‌ వెనుక కొందరు ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. టాస్క్‌ఫోర్స్‌, విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసిన సమయంలో ఈ ప్రజాప్రతినిధులు వ్యాపారులకు అండగా నిలుస్తుండడంతో అధికారులు నామమాత్రపు కేసులు పెడు తూ చేతులెత్తేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా శాంపిల్స్‌ సేకరిస్తున్నాం…
ఈ విషయమై ఆదిలాబాద్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ను సంప్రదించగా జిల్లా వ్యాప్తంగా వైన్‌ షాపులలో తమ సిబ్బంది శాంపిల్స్‌ సేకరిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్‌ తదితర ప్రాంతాల్లో మద్యం వైన్‌ షాపులలో పని చేసే వారు బాటిల్స్‌లలో నీరు కలుపుతున్నారని, కల్తీ మద్యం విక్రయించడం లేదన్నా రు. ఇటీవల నిర్మల్‌లో ఇతర జిల్లాకు చెందిన ఎక్సై జ్‌ అధికారులు మద్యం సీసాలలో నీరు కలుపడం వల్లనే సీజ్‌ చేశారని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా గుడుంబాను అరికట్టడంతోపాటు కల్తీ మద్యం అ మ్మకాలపై గట్టి నిఘాను ఏర్పాటు చేశామని, జిల్లాలో ఎక్కడైనా కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారాన్ని చేరవేస్తే సదరు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు.

 

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

+ 63 = 68