ఫేస్ బుక్ లో హాల్ చల్ చేస్తున్న బాహుబలి

బాహుబలి సినిమా విడుదలై నెలలు గడుస్తోంది… ఇటీవల టీవీలోనూ ప్రసారమైంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఏదో రూపేణా ఈ సినిమా ప్రస్తావన వస్తూనే ఉంది. ఆ మధ్యయితే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడంటూ ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది… ఈ సినిమా గురించి అంతలా చర్చించుకోవడం వల్లే కాబోలు.. ఇప్పుడీ మూవీ ఈ ఏడాది ఇండియన్ ఫేస్ బుక్ రివ్యూలో టాప్-10 లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది. వరల్డ్ వైడ్‌గా ఉన్న తమ యూజర్స్.. ఏ టాపిక్ గురించి ఎక్కువ డిస్కస్ చేశారనే విషయంతో పాటు.. కంట్రీ వైజ్‌గా ఏ టాపిక్ గురించి ఎక్కువ ప్రస్తావించారనే విషయాలను వెల్లడిస్తూ..ఈ ఇయర్ రివ్యూను రిలీజ్ చేసింది ఫేస్ బుక్ సంస్థ.
పాపులారిటీలో నాలుగోస్థానంలో బాహుబలి!
ఇండియాకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫేస్ బుక్ యూజర్స్ ఈ ఏడాది ప్రధాని మోదీ గురించి ఎక్కువగా చర్చించారట… ఆపై ఈ కామర్స్ సంస్థల గురించి… ఇటీవల కన్నూమూసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గురించి ఎక్కువ చర్చ చేశారట… ఇక ఆ తర్వాతి స్థానంలో బాహుబలి సినిమా గురించే ఎక్కువగా చర్చించినట్టు ఫేస్ బుక్ సంస్థ తెలియజేసింది…. సో బాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు వస్తున్నా.. ఎందరో స్టార్ హీరోలు ఉన్నప్పటికీ…. ఎక్కువగా బాహుబలి సినిమా గురించే చర్చ జరిగిందంటే ఈ సినిమాకు ఎంతటి క్రేజ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు… ఇక సినిమాలకు సంబంధించి ఫేస్ బుక్ పాప్యులారిటీలో ఆరవస్థానంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్… 9వ స్థానంలో దీపిక నిలిచారు. బాలీవుడ్ స్టార్స్‌ను కూడా వెనక్కు నెట్టి.. ఫేస్ బుక్‌లో పాపులారిటీలో టాప్ -4లో నిలిచాడు బాహుబలి. రాబోయే రోజుల్లో బాహుబలి ఖాతాలో ఇంకెన్ని రికార్డులు జమ అవుతాయో చూడాలి..!

 

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

99 − = 91