మద్యానికి లోటు లేని నవ్యాంధ్ర

  • జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు తిలోదకాలు 
  • స్టేషన్ల వారీగా నెలకు వేలల్లో వసూళ్లు 
  • రూ.కోట్లు ముట్టచెప్పాల్సి వస్తున్న వ్యాపారులు 
  • యథేచ్ఛగా కల్తీ మద్యం.. ఎమ్మార్పీ ఉల్లంఘన 
  • వేళాపాళా లేకుండా మద్యం వ్యాపారాలు 


మామూళ్ల మత్తులో అధికారులు జోగుతుండగా.. మద్యం నిబంధనలు జిల్లా వ్యాప్తంగా చిత్తవుతున్నాయి. స్టేషన్ల వారీగా నెలకు వసూలు చేసే మామూళ్లు రూ.కోట్లలో ఉంటున్నాయి. మామూళ్లు పెనుభారంగా మారడంతో ఆ భర్తీని పూడ్చుకునేందుకు మద్యం దుకాణ నిర్వాహకులు ప్రత్యామ్నాయమార్గాలు పడుతున్నారు. ఈ క్రమంలో కల్తీ మద్యం.. ఎమ్మార్పీ ఉల్లంఘన.. సమయపాలన పాటించకపోవడం.. బెల్టు షాపుల నిర్వ హణ.. తదితరాలు సర్వ సాధారణంగా ఉంటున్నాయి. కల్తీ కాటుతో పలువురు బలవుతున్నా.. అధిక ధరలతో మందుబాబుల జేబులుకు చిల్లు పడుతున్నా.. పట్టించుకునే వారే కరువవుతున్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రం హడావుడీ చేసి ఆ తర్వాత నిమ్మకు మత్తెక్కినట్లుగా వ్యవహరిస్తున్నారు.

ప్రత్యేకంగా వసూలు..
మద్యం నియంత్రించే రెండు శాఖల అధికారులు మామూళ్లు నిర్ధేశించి వసూలు చేస్తారు. ఈ మద్యం మా మూళ్లు వసూలు చేసేందుకు ఆయా శాఖలకు.. స్టేషన్ల వారీగా ప్రత్యేక సిబ్బందిని అధికారులు నియమించు కున్నారంటే ఆశ్చర్యం కాదు. డిమాం డ్‌.. పరిస్థితిని బట్టి ఒక్కో దుకాణం నుంచి నెలకు కనీసం రూ.10 వేల నుంచి రూ.22 వేల వరకు ఒక శాఖకు, మరో శాఖకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు మామూళ్లు చెల్లించాల్సి వస్తున్నది.

ఎనీటైం మద్యం..
జిల్లాలో మొత్తం 186 బార్లు, 351 వైన్‌ షాపులు ఉన్నాయి. ఇందులో అధిక శాతం 24 గంటలు తెరిచే ఉంటాయి. బార్లలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే విక్రయాలు జరగాలి. వైన్‌ షాపుల్లో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలి. అయితే ఈ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితం
అవుతున్నాయి.

నెలకు రూ.2.50 కోట్ల మామూళ్లు

జిల్లాలో బార్లు, వైన్సలు కలిపి మొత్తం 537 ఉన్నాయి. డిమాండ్‌.. పరిస్థితిని బట్టి కనీసం రూ.10 వేల నుంచి రూ. 22 వేల వరకు ఒక శాఖకు, రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు మరో శాఖకు దుకాణ నిర్వాహకులు మామూళ్లను చెల్లిస్తున్నారు. ఈ మొత్తం ఎంత తక్కువ వేసుకున్నా నెలకు సుమారు రూ.2.50 కోట్లకు పైమాటే అంటే ఆశ్చర్యం కాదు.

#LiquorMafia

#LiquorScam

#LiquorScandal

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

+ 40 = 44