వరద బాదితలకు 2-కోట్లు విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెన్నై వరద బాధితులకు అండగా నిలిచాడు. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కాస్త ఆలస్యంగా స్పందించినా… తనదైన శైలిలో బాధితులను ఆదుకునేందుకు విరాళాన్ని ప్రకటించినట్లు దర్శకుడు వర్మ తన ట్విట్ల ద్వారా తెలిపాడు. చెన్నై మహానగరాన్ని అతలాకుతలం చేసిన వరదల కారణంగా రాష్ట్రంలో భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం తీవ్ర ఇక్కట్లు పడుతున్న విషయం విధితమే. వరద బాధితుల సహాయార్థం ఇప్పటికే పలువురు టాలీవుడ్, కోలీవుడ్ తారలతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా తమ విరాళాన్ని ప్రకటించి చెన్నై బాధితులకు అండగా నిలుస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ చెన్నై బాధితుల సహాయార్థం రెండు కోట్ల రూపాయలు విరాళాన్ని ప్రకటించినట్టు వర్మ ట్విట్ల ద్వారా తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘‘కొన్నిసార్లు రావడం లేట్ అవుతుందేమో కానీ.. రావడం మాత్రం పక్కా’ అని గబ్బర్‌సింగ్ చిత్రంలో పవన్ చెప్పిన డైలాగు నిజమేనని మరోసారి నిరూపించాడంటున్నారు అభిమానులు.
ఇదిలా ఉంటే….పవన్ విరాళంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపాడు. పవన్ కళ్యాణ్‌కి సెల్యూట్ చేస్తున్నానని, ఇప్పుడు నిజమైన పవర్ స్టార్ అని అనిపించుకున్నాడని ట్వీట్ చేశాడు. ఇంతటితో ఆగకుండా పవన్‌ కళ్యాణ్, రజనీకాంత్ విరాళంతో ముడిపెడుతూ…కొన్ని ట్విట్స్ చేశాడు. రజనీకాంత్ ఇచ్చిన పది కోట్ల కన్నా…పవన్ ఇచ్చిన రెండు కోట్లు చాలా ఎక్కువ. రజనీకాంత్ తన ప్రజల కోసం విరాళం ఇవ్వగా…పవన్ మాత్రం తన సహృదయాన్ని చాటుకున్నాడు. చేగువేరాకు నిజమైన అభిమానిగా పవన్ ప్రూవ్ చేసుకున్నాడని వర్మ ట్విట్ చేశాడు. ఈ విషాదం పట్ల సూపర్ స్టార్ కన్నా..పవర్ స్టార్ 20 రెట్లు సానుభూతి తెలిపాడని ట్విట్ చేశాడు.

 

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

24 + = 28