రెబల్ స్టార్ లేని బాహుబలి – 3

బాహుబలి-3కి కూడా స్క్రిప్ట్ సిద్ధమవుతోందట..!
మూడేళ్ల క్రితం బాహుబలి కి శ్రీకారం చుట్టిన రాజమౌళి.. తీరా కొంతభాగం షూటింగ్ చేశాక.. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలనే నిర్ణయానికొచ్చాడు… ఇక బాహుబలి చిత్రం విడుదలై భారీ విజయాన్ని అందుకున్నాక… ఈ సినిమా రెండు భాగాలు కాదు.. మూడో భాగం కూడా ఉండబోతోందని స్వయంగా దర్శకుడు రాజమౌళినే అనౌన్స్ చేశాడు… ప్రస్తుతానికి రెండు భాగాలకు సంబంధించిన కథ మాత్రమే సిద్ధంగా ఉందని.. కానీ బాహుబలి-3 కూడా తప్పకుండా ఉంటుందన్నారు. తాజాగా రాజమౌళి తండ్రి.. బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం బాహుబలి-3కి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.
బాహుబలి-3లో ప్రభాస్ ఉండడా..?
గత మూడేళ్లుగా మరే కొత్తచిత్రం అంగీకరించకుండా బాహుబలికే అంకితమైన ప్రభాస్.. వచ్చే ఏడాది ప్రథమార్థం అంతా.. బాహుబలి-2కే తన డేట్స్ కేటాయించనున్నాడు… ఈ నేపథ్యంలో బాహుబలి-3 కూడా పట్టాలెక్కితే.. ఇక ప్రభాస్ డేట్స్ దొరకడం మరో రెండేళ్లవరకూ కష్టం… హాలీవుడ్ హీరోల తరహాలో బాహుబలి సిరీస్‌లో మాత్రమే ప్రభాస్ చూడాల్సిన సిట్యువేషన్ వస్తుంది… అయితే అలాంటి పరిస్థితి ఉండబోదట… ఎందుకంటే.. బాహుబలి-3లో ప్రభాస్ ఉండడట… ఇటీవల ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఈ విషయాన్ని కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించాడట… ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశామని.. ప్రభాస్ లేకుండానే బాహుబలి-3 ఉండబోతోందని.. ఆమాటకొస్తే కట్టప్ప.. శివగామి తదితర పాత్రలేవీ ఈ సినిమాలో ఉండబోవని విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది… మరి ఈ వార్తల్లో వాస్తవమెంతో తెలియాలంటే.. రాజమౌళి మరోసారి ట్విట్టర్ లో స్పందించాల్సిందే..!

 

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

68 − 60 =