కలబంద తో ఆరోగ్య సూచనలు

 బాలానగర్ : కలబంద అంటే తెలియని వారుండరు. అడవి ప్రాంతంలో ఎక్కువగా పెరిగే ఈ చెట్టుకు ఉన్న ముల్లులను చూడగానే ప్రతీ ఒక్కరు దీనిని గుర్తు పడతారు. మరికొందరు ఇంటికి దిష్టి తగలకుండా పెంచుకుంటూ ఇంటి ముందు తొట్టిలో పెంచుకోవడమో, లేక ఇంటి గుమ్మానికి వేలాడ దీయడమో చేస్తుంటారు. నిజానికి కలబందకు రోగాలను నివారించే శక్తి కూడా ఉంది.
ఔషధ గుణాలెన్నో…..
కలబందలో అనేక ఔషధగుణాలున్నాయి. దీంట్లో 99.3 శాతం నీరుతో పాటు విటమిన ఏ, బీ విటమిన్లు, ఎంజైములు, మినరల్స్‌, ఆంద్రోక్వినోన్ష్‌, కార్టాసిలిక్‌యాసిడ్‌, 22 అమైనోయాసీడ్స్‌ ఉంటాయి. ఇందులోని ఎంజైమ్‌ నొప్పి నివారణకు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులోని యాంటిమైక్రోబయల్‌గుణం ఉన్న సాపోనిన్స్‌ బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌, ఈస్ట్‌లపై దాడి చేస్తాయి. కలబందను జ్యూస్‌ రూపంలో తీసుకుంటే శరీరంలో జరిగే వివిధ జీవక్రియల ఫలితంగా ఉత్పత్తి అయ్యేటువంటి హానికర పదార్థాల నుంచి ఇది సమర్థవంతంగా రక్షణ కల్పిస్తోంది. దీనిని సేవించడం ద్వారా పేగుల్లో దాగి ఉన్న బ్యాక్టీరియాను, పారసైట్‌లను నాశనం చేసి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. జాండిస్‌ లాంటీ కాలేయ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతూ లైంగిక పటుత్వాన్ని , రోగ నిరోధక శక్తిని పెంచి షుగరును, మలబద్దకాన్ని నిరోధించి అల్సర్‌ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వైద్య పరంగా చూస్తే కలబందలోని మెగ్నీషియం లాక్టెట్‌, వ్యాధుల నివారణకు, కీటకాలు కుట్టినపుడు కలిగే బాధకు నివారిణిగా పని చేస్తుంది.
చర్మ సౌందర్యం కోసం….
చర్మాన్ని సూర్యరశ్మి నుంచి కాపాడుకోవడానికి, కాంతివంతంగా ఉంచుకోవడానికి కలబంద జెల్‌ చాలా ఉపయోగపడుతుంది. ఇది మంచి కూలింగ్‌ ఏజెంట్‌గా పని చేస్తుంది. ప్రస్తుతం కాస్మోటిక్‌ రంగంలో కలబందకు మంచి డిమాండ్‌ ఉంది. ఫేస్‌ మాయిశ్చర్‌గా, కేశాల సంరక్షణ కోసం చుండ్రును తొలగించి కుదుల్లను బలంగా తయారు చేస్తుంది. బట్టతలను నివారిస్తుంది. మొటిమలను తొలగిస్తుంది. చర్మం ముడుతలుపడటాన్ని నిరోధిస్తుంది. కంటికింద వచ్చే ముడుతలు, నలుపును పోగొడుతుంది. ప్రెగ్నెన్సీ అనంతరం వచ్చే సె్ట్రచె్‌సను తొలగిస్తుంది. సొరియాసిస్‌, గజ్జి తదితర చర్మ సంబంధ వ్యాధులను అరికడుతుంది. ఇంతటి ఔషధగుణాలున్న కలబందతో శాస్త్రవేత్తలు స్ర్పే, జెల్‌, లోషన్‌, లిక్విడ్‌, క్రీమ్‌ క్యాప్సుల్స్‌ తదితర వాటిని తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

+ 57 = 64