రానా తో సినిమా చేయనున్న శ్రీనువైట్ల

ఓ హిట్ సినిమా తర్వాత ఆ దర్శకుడికి ఎంతటి క్రేజ్ పెరుగుతుంతో తెలిసిందే. అదే ఓ ప్లాప్ వస్తే ఇందుకు వ్యతిరేక పరిస్థితులు కనిపిస్తాయి. శ్రీనువైట్ల విషయంలో ఏకంగా రెండు పరాజయాలు వరుసగా పలకరించాయి. ఆగడు సినిమా ప్లాప్ నుంచి తేరుకునేలోపే బ్రూస్ లీ కూడా సేమ్ రిజల్ట్‌ను ఇచ్చింది. పరాజయానికి కారణం ఏమైనప్పటికీ ప్లాప్ మాత్రం శ్రీను ఖాతాలోనే జమయింది. దీంతో.. ఇప్పుడప్పుడే శ్రీనువైట్లకు అవకాశాలు రావడం కష్టమనే ప్రచారం కూడా సాగింది. అయితే.. అందరికీ షాక్ ఇస్తూ.. అప్పుడే మరో సినిమాకు కమిట్ అయ్యాడట శ్రీనువైట్ల.
రానాతో శ్రీనువైట్ల సినిమా..!
తాజా సమాచారం ప్రకారం…శ్రీనువైట్ల ఇటీవల రానాకు ఓ స్టోరీ విన్పించాడట. ఈ స్టోరీ రానాకు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను సురేష్ బాబు నిర్మిస్తారా లేక.. మరో బ్యానర్‌లో తెరకెక్కిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకూ తాను ఫాలో అవుతున్న రెగ్యులర్ ఫార్మట్ వల్లే ప్లాపులొస్తున్నాయని గ్రహించిన శ్రీనువైట్ల.. ఈసారి మరో జోనర్‌ను టచ్ చేయబోతున్నాడట. త్వరలో బాహుబలి-2తో రానా బిజీ అవనున్న నేపథ్యంలో.. ఈ సినిమా పూర్తయ్యాకే శ్రీనువైట్ల సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోందని తెలుస్తోంది. మరి.. రానా సినిమాతోనైనా శ్రీనువైట్ల హిట్ కొటతాడేమో చూద్దాం..!

rana1

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

42 + = 46