డిసెంబర్ 10న గో రక్షణ-బీఫ్ ఫెస్టివల్ కాదు

ఉస్మానియా యూనివర్సిటీలో డిసెంబర్ 10న బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ప్రకటన వెలువడిన నేపథ్యంలో స్వామి పరిపూర్ణానంద స్పందించారు. ఆరోజు ‘బీఫ్ ఫెస్టివల్ కాదు..కౌ ఫెస్టివల్ నిర్వహించుకుందామని’ పిలుపునిచ్చారు. హిందువుల ఆరాధ్య దైవమైన గోమాతను వధించడం మహా పాపమన్నారాయన. గోవులను రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని .. అందులో భాగంగా డిసెంబర్ 10న  అందరూ గోశాలలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. అదే రోజు హైదరాబాద్ ‘గో రక్షా సమితి’ ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్ బండ్ లో ఉదయం 7 గంటలకు ‘గో రక్షా దివస్’ ను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఆరోజు ఎక్కడ గోవులు కనిపించినా భక్తితో పూజించమని స్వామి పరిపూర్ణానంద  సూచించారు. గోవులను రక్షించాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరనున్నట్లు ఆయన చెప్పారు.  గో మాంసం తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని.. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా రుజువు చేసిందని ఆయన తెలిపారు. మరోవైపు కొందరు ప్రొఫెసర్లు హిందూ మతాన్ని దెబ్బ తీసేందుకు కుట్ర పన్నారని స్వామి పరిపూర్ణానంద ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే బీఫ్ ఫెస్టివల్ కు వారు మద్దతు పలుకుతున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో స్వామి పరిపూర్ణానంద మాట్లాడారు.

swami

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

89 − 86 =