వరద బాధితులకు కోటి విరాళం చేసిన లారెన్స్

తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రమంతా అతలాకుతలమయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాజధాని చెన్నై శివార్లలో పలు జిల్లాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఇలా వర్షాలు, వరదలతో చెన్నై నీట మునగడాన్ని చూసిన పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు ఇప్పటికే వరద బాధితుల సహాయార్థం విరాళాలు ప్రకటించారు. చెన్నై ప్రజలు ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శిచాలని ధైర్యం చెబుతున్నారు. అందులో భాగంగా తాజాగా కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ చెన్నై వరద బాధితులకు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. సామాజికి కార్యక్రమాల్లో ఎప్పుడూ నేనుంటా అంటూ అందరికి ఆదర్శంగా నిలుసున్న వ్యక్తి రాఘవ లారెన్స్. గతంలో కూడా నిరుపేదల విద్య కోసం లారెన్స్ కోటి రూపాయలు విరాళాన్ని ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు.larence

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

87 − = 81