అబ్దుల్ కలాం జీవిత సంఘటన

ఒకరోజు పగలంతా ఎక్కువగా పని ఉండటంతో అబ్దుల్ కలాం గారి వాళ్ళమ్మ బాగా అలసిపోయింది.

ఆ రోజు రాత్రి వంట పూర్తయిందనీ……….., భోజనానికి రమ్మని……. ఆమె పిలవడంతో అబ్దుల్ కలాం గారు, తన తండ్రితో కలిసి భోజనం చేయడానికి సిద్దపడ్డారు.

తన తండ్రి ముందు ఒక ప్లేట్ లో పెట్టిన రొట్టెలు బాగా మాడిపోయి ఉండటాన్ని చూసిన అబ్దుల్ కలాం గారు, ఆయన వాటిని తినే ముందు తన తల్లిని ఏమైనా కోప్పడతారేమోనని…………, మౌనంగా అలాగే చూస్తూ ఉండిపోయారు.

కానీ ఆయన ఆ రొట్టెలను తిని………, ఆమెను ఏమీ అనకుండా లేచి వెళ్ళిపోయాడు.

కొద్దిసేపటికి ఆమె, తన భర్త దగ్గరకు వెళ్ళి…….. ” రొట్టెలు మాడిపోయినందుకు క్షమించమని…….” కోరింది.

వెంటనే ఆయన, ” నాకు మాడిపోయిన రొట్టెలంటే చాలా ఇష్టం….. ” అని ఎంతో ప్రేమగా ఆమెతో అన్నారు.

ఇదంతా గమనించిన అబ్దుల్ కలాం గారు, కొద్దిసేపటి తర్వాత తన తండ్రి దగ్గరకు వెళ్ళి ” మీకు నిజంగా మాడిపోయిన రొట్టెలు అంటే అంత ఇష్టమా…..? అని అడిగారు.

ఆయన అబ్దుల్ కలాం గారి తల నిమురుతూ……, ” మీ అమ్మ పగలంతా కష్టపడి ఎంతో అలసిపోయింది. అంత అలసటలో కూడా విసుగు లేకుండా వంట చేసింది. ఒక్కపూట మాడిపోయిన రొట్టెలు తింటే మనకేమీ కాదు. కానీ ఆ రొట్టెలు మాడిపోయాయని విమర్శిస్తే…….., ఆమె మనసు ఎంతగానో బాధ పడుతుంది.అలా బాధ పెట్టడం నాకిష్టం లేదు. జీవితంలో ఎవరైనా కొన్ని సందర్భాలలో పొరపాట్లు చేయడం సహజం. ఆ పొరపాట్లను ఆధారంగా చేసుకొని విమర్శించడం మంచిది కాదని……..” ఆయన అన్నారు.

ఈ సంఘటన ద్వారా అబ్దుల్ కలాం గారు చెప్పిన విషయం

ఎదుటివారు చేసిన పొరపాట్లను చూసి తొందరపడి విమర్శించి వారి మనసులను బాధ పెట్టకండి. బంధాలను బలపరుచుకుంటూ జీవితాలను కొనసాగించండి.abdulkalam

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 + 1 =