వై ఫై అలర్జీ తో ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి

లండన్: సెల్‌ఫోన్ సిగ్నల్స్‌, వైఫై వంటివి ప్రమాదకరమని, అవి దీర్ఘకాలంలో కేన్సర్‌కు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయితే వాటివల్ల తీవ్రమైన ముప్పు ఉన్నట్లు ఇంతవరకూ ఎలాంటి ఆధారాలూ లభ్యం కాలేదు. అయితే బ్రిటన్ లో ఓ స్కూల్‌ విద్యార్థిని కనీవినీ ఎరుగని రీతిలో ‘వైఫై అలర్జీ’తో బాధపడింది. స్కూలులో వైఫై వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురుకావడంతో చివరికి ఆత్మహత్య చేసుకుంది. జెన్నీకి ఎలకో్ట్ర హైపర్‌ సెన్సిటివిటీ ఉందని ఆమె తల్లి తెలిపింది. జెన్నీకి ఉన్న సమస్య వల్ల ఆమె ఇంట్లో వైఫైను తొలగించారు. కానీ స్కూల్‌లో మాత్రం వైఫై ఉండడంతో ఆమె తీవ్రంగా బాధపడేది. కొన్నిసార్లు క్లాసులో నుంచి బయటికి వెళ్లిపోయి దూరంగా కూర్చునేది. ఈ విషయమై స్కూల్‌ యాజమాన్యానికి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోయింది. చివరికి తన ఇంటి సమీపంలోని పొదల్లో ఓ చెట్టుకు ఉరేసుకుంది.jenny 

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

− 2 = 2