“రాక్ స్టార్ గా రానున్న దేవిశ్రీప్రసాద్”

పేరుకు మ్యూజిక్ డైరెక్టరే అయినా… ఓ స్టార్ హీరో రేంజ్ ఇమేజ్ తెచ్చుకోవడంలో సక్సెస్ అయిన దేవిశ్రీప్రసాద్… త్వరలోనే హీరోగా మారబోతున్న విషయం తెలిసిందే. నిజానికి చాలాకాలం క్రితమే దేవిశ్రీ హీరోగా నటించబోతున్నట్టు వార్తలు వినిపించినా… మనోడు మాత్రం మ్యూజిక్ డైరెక్టర్‌గా కంటిన్యూ అయ్యేందుకే ఎక్కువగా ఆసక్తి చూపించాడు. అయితే… ఈ మధ్య హీరోగా మారాలనే కోరిక ఎక్కువవడంతో పాటు తన క్లోజ్ ఫ్రెండ్ అయిన సుకుమార్ ప్రొత్సహించడంతో హీరోగా నటంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దేవిశ్రీ. దిల్ రాజు నిర్మాతగా సుకుమార్ డైరెక్షన్‌లో దేవిశ్రీ సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు కూడా. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్‌పై ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ పెరిగిపోయింది.
ఇక ఈ మూవీ స్టోరీ ఏంటి, హీరోయిన్ ఎవరనే దానిపై ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆసక్తి కనిపిస్తోంది… ఇవన్నీ ఎలా ఉన్నా… ఈ సినిమా టైటిల్ విషయంలో మాత్రం సినీ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి… ఈ నేపథ్యంలో దేవిశ్రీ ఫస్ట్ మూవీకి ‘రాక్ స్టార్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. మ్యూజిక్‌తో ఆడియెన్స్‌లో ఎనర్జీ నింపే ఈ యువ సంగీత కెరటం తెరంగేట్రానికి ఇదే సరైన టైటిల్ అని దర్శకనిర్మాతలు డిసైడయినట్టు సమాచారం. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ స్టేట్ మెంట్ రాకపోవడంతో… ‘రాక్ స్టార్’‌ టైటిల్‌ను ఖరారు చేస్తారా లేక మరో పవర్ ఫుల్ టైటిల్ కోసం దీన్ని హోల్డ్‌లో పెడతారా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఏదేమైనా… రాక్ స్టార్ టైటిల్‌కు పర్ఫెక్ట్‌గా సూటయ్యే దేవిశ్రీప్రసాద్… నిజంగానే ఆన్ స్క్రీన్ పై రాక్ స్టార్‌గా ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి…

devi

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

+ 7 = 8