“సౌతాఫ్రికా పై విజయం సాధించిన భారత్”

నాగ్‌పూర్: టీ-ట్వంటీ, వన్డే సిరీస్‌ల్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. గాంధీ-మండేలా సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ, వన్డే సిరీస్‌లను కోల్పోయిన భారత్..దక్షిణాఫ్రికాతో జరుగుతున్ననాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 కైవసం చేసుకుంది. 32/2 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన సఫారీ జట్టు భారత స్పిన్నర్ల ధాటికి 185 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 124 పరుగులతో ఘనవిజయాన్నిసాధించింది. ఆమ్లా,డుప్లెసిస్ కొద్ది సేపు ప్రతిఘటించినా మిగతా బ్యాట్స్‌మెన్లు పెద్దగా పోరాడలేకపోవడంతో భారత్ మూడు రోజుల్లోనే టెస్ట్‌ మ్యాచ్‌ను ముగించేసింది. భారత బౌలర్లలో అశ్విన్ 7, మిశ్రా 3 వికెట్లు పడగొట్టారు. మొహలీ, నాగ్‌పూర్ మ్యాచ్‌లలో భారత్ గెలవగా బెంగళూరులో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది.kohli

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

+ 13 = 21