“కార్తీక సిరి …. ఉసిరి”

కార్తీకమాసం వచ్చిందంటే చాలు వనభోజనాల కోసం ఉసిరిచెట్టు ఎక్కడవుంద అని అన్వేషిస్తుంటారు ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్కపుటైన భోజనం

చేయాలన్నది హైందవ సంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మయిన వెంట తీసుకువెళ్ళి మరీ భోజనం చేస్తుంటారు. ఎందుకంటే కార్తికంలో శ్రీ మహావిష్ణువు ,లక్ష్మీ దేవి

ఇద్దరూ కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కధనం. ఉసిరిని భుమాతగాను కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృతబిందువులు పొరపాటున భూమ్మీద పడటంతో పుట్టిందే

ఉసిరి అన్నది ఓ కధనం. ఏది సకల మానవాళిని రక్షిస్తుందనీ విశ్వసిస్తారు. వృద్దప్యాన్ని దరిచేరనివ్వని ఔషద మొక్కలలో ఉసిరికి ఉసిరే సాటి అని చెపుతుంది చరకసంహిత. అందుకే

ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెబుతుంటారు. అంతటి మహాత్తరమైనదిగా భావించే ఆ చెట్టు ఫలం మరెంతటి ఉత్తమోత్తమమైనదో వేరే చెప్పాలా ?అందుకే

ఆయుర్వేద వైద్యానికి ఉసిరే కీలకం.usiri

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

72 − 62 =