“భర్త పై కేసు పెట్టిన సినీ గాయని కౌసల్య”

ప్రముఖ సినీ నేపథ్యగాయని కౌసల్య తన భర్త బాలసుబ్రహ్మణ్యం వేధింపులు తారస్థాయికి చేరినట్టు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంగళరావునగర్‌లో నివాసముంటున్న ఆమె గతంలో భర్త వేధింపులపై ఎస్‌.ఆర్‌.నగ ర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
దీనిపై 498 ఏ సెక్షన కిం ద పోలీసులు కేసు నమోదుచేశారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తొలగించేందుకు ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అయినా ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కొద్దికాలంగా తన భర్త ఫోనలో వేధిస్తూ చంపేస్తానంటూ బెదిరిస్తున్నట్టు ఈ నెల 22న మరోసారి ఫిర్యాదు చేసినట్టు ఎస్‌.ఆర్‌.నగర్‌ ఇనస్పెక్టర్‌ సతీష్‌ తెలిపారు. దీనిపై 506, 507 సెక్షన్ల కింద గాయని కౌసల్య భర్త బాలసుబ్రమణ్యంపై కేసు నమోదు చేసినట్టు ఇనస్పెక్టర్‌ చెప్పారు. భర్త తరచూ ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడని ఆమె 22న ఎస్‌ఆర్‌నగర్‌ పో లీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈమె మేరకు రెం డు సెక్షన్ల కింద కేసు దర్యా ప్తు చేస్తున్నట్టు పోలీసులు వ్లెలడించారు. గుంటూరు జిల్లా నిజాంపట్నానికి చెందిన కౌసల్య నాగార్జునసాగర్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. గుంటూరు మహిళా కళాశాలలో ఇంగ్లిష్‌ లిటరేచర్‌ పూర్తిచేశారు. ఇంటర్‌ చదువుతున్నపుడే బాల్యస్నేహితుడు బాలసుబ్రమణ్యంతో ప్రేమలోపడి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. అయితే కొద్దికాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థ లు చోటుచేసుకున్నాయి. ఇరువురిని కలపాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.kowsalya
Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 + 3 =