“తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి…భక్తులతో నిండిన శివాలయాలు”

కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పుష్కరస్నానాలు ఆచరించి దీపాలు విడిచిపెట్టారు.
* ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం భక్తజనసంద్రమైంది. పంచాక్షరి మంత్రంతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. పాతాళగంగలో స్నానమాచరించిన భక్తులు గంటలో దీపాలు విడిచిపెట్టారు. భ్రమరాంబమల్లికార్జున స్వామివారి సుప్రభాత, మహామంగళహారతులు తరువాత భక్తులను అనుమతించారు.
* నల్గొండ జిల్లా యాదాద్రిలో భక్తుల సందడి నెలకొంది. విష్ణుపుష్కరినిలో స్నానమాచరించి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదగయా క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కుకుటేశ్వరస్వామి, దత్తాత్రేయస్వామి, రాజరాజేశ్వరస్వామి, పురుహూతిక అమ్మవార్లను దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కుకుటేశ్వరస్వామికి పంచామృతమహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. అమ్మవారికి రక్షపత్రిపూజ, లక్ష కుంకుమార్చన చేశారు.
* నల్గొండ జిల్లాలోని మేళ్లచెరువులోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ముక్కంటికి మహాన్యాసపూర్వకఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే పరమేశ్వరున్ని దర్వించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
* కడప జిల్లా రాజంపేట మండలం గుంగులూరులోని శ్రీ ఆగస్తేశ్వరస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు. ముక్కంటికి పంచామృత అభిషేకం నిర్వహించారు. బహుదానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి సదాశివునికి దీపారాదన చేశారు.
* రంగారెడ్డి కీసర భక్తజనసంద్రమైంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీభవానీ రామలింగేశ్వరస్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామివారికి భక్తులు పంచామృత అభిషేకాలు దీపారాదనలు చేసి మంగళనీరాజనాలు అందించారు.sri
Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

− 6 = 4