“ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి…ముగ్గురు మృతి”

శ్రీనగర్: భారీగా ఆయుధాలు కలిగిన ముగ్గురు ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్ సరిహద్దులోని తంగ్‌ధర్ సెక్టార్‌లో భారత ఆర్మీ శిబిరంపై దాడి చేశారు. కుప్వారా జిల్లాలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ, గ్రైనేట్లు విసురుతూ క్యాంపులోనికి చొచ్చేకెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన ఆర్మీ జవాన్లు వారిపై ప్రతి దాడి చేశారు. ప్రత్యేక బలగాలను కూడా రంగంలోకి దింపారు. ఇరు వైపులా సుమారు 7 గంటల పాటు కాల్పులు జరిగాయి. చివరకు ముగ్గురు ముష్కరులు మృతి చెందారు. వీరిని ఫిదాయిలుగా అనుమానిస్తున్నారు. ఏకె 47 రైఫిల్స్‌తో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల్లో ఓ సాధారణ వ్యక్తి కూడా చనిపోయాడు. ఒక జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్యాంప్‌లో సుమారు 80 మంది ఆర్మీ జవాన్లు ఉన్నారు. కాల్పుల్లో పలు బ్యారెక్స్‌కు మంటలంటుకున్నాయి. ఈ దాడికి పాల్పడింది తామేనని జేఈఎం ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. మరోవైపు పూంచ్‌లో ఓ ఉగ్రవాద శిబిరాన్ని సైనికులు గుర్తించారు. భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.army

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

10 + = 19