“సర్దార్ సరసన సంజన”

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గుజరాత్‌లో జరుగుతున్న సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సెట్స్‌లో ముద్దుగుమ్మలు కాజల్, లక్ష్మీరాయ్‌తో సందడి చేస్తోన్న పవన్‌తో జతకట్టేందుకు ఇప్పుడు కన్నడ హాట్ బ్యూటీ సంజన కూడా రెడీ అయింది. ఇప్పటికే ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ రోల్ కోసం కాజల్‌ను ఎంపిక చేసుకున్న పవన్ ఆ తరువాత ఐటమ్ సాంగ్‌తో పాటు ఓ కీలక పాత్ర కోసం రాయ్ లక్ష్మీకి అవకాశమిచ్చాడు. ఇప్పుడు తాజాగా వీరిద్దరితో పాటు సంజనకు ఓ స్పెషల్ క్యారెక్టర్ ను ఆఫర్ చేశాడు పవర్ స్టార్. బుజ్జిగాడు మూవీతో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సంజన అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది.
గ్లామర్ విషయంలో ఎలాంటి షరతులు పెట్టకపోయినప్పటికీ సంజనకి తెలుగునాట పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఇక దాదాపు తెరమరుగయ్యే పరిస్థితుల్లో ఉన్న సంజనకు సడెన్ గా పవన్ పిలిచి మరీ తన క్రేజీ ప్రాజెక్ట్ సర్దార్ లో నటించే ఛాన్స్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ బ్యూటీకి పవన్ ఆఫర్ చేసిన క్యారెక్టర్ లో స్కిన్ షోకు అవకాశమే ఉండదని తెలుస్తోంది. పట్టుచీర కట్టుకొని.. నగలు ధరించి.. ఓ మహారాణి టైపు రోల్ లో అమ్మడు మెరవనుందని వినికిడి. ఈ తరహా పాత్రతో సంజన పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేస్తుందో లేదో అనే విషయం పై ఇప్పటికైతే క్లారిటీ లేదు.sanjana
Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

− 1 = 5