“ప్రధాని మోడీ నివాసం వద్ద కాల్పులు…కంగారు పడ్డ అధికారులు”

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ నివాసం వద్ద బుధవారం రాత్రి జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. ఢిల్లీలోని మోదీ అధికార నివాసం వద్ద రాత్రి దాదాపు ఎనిమిది గంటల సమయంలోఓ కానిస్టేబుల్ చేతిలోని ఏకే-47 తుపాకీ మిస్‌ఫైర్ అవడంతో మూడు రౌండ్ల కాల్పులు జరిగినట్లు అధికారులు ధృవీకరించారు.
ప్రధాని నివాసం వద్ద ఉన్న మీడియా పాయింట్‌లో భద్రత విధులు నిర్వహిస్తున్న ఢిల్లీ పోలీసు తన ఏకే-47 గన్‌ను లోడ్ చేస్తుండగా మిస్‌ఫైర్ అయి కాల్పులు చెలరేగాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రధాని నివాసం వద్ద కాల్పులు చోటుచేసుకోవడంతో మోదీ భద్రత సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఈ ఘటనతో ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రధాని నివాసం వద్ద జరిగిన కాల్పుల ఘటనపై విచారణ చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.modi
Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

+ 83 = 93