“ఏసిబి వలలో ఎంవీఐ సంపతరావు రమేష్”

  • రూ.కోట్లు కూడబెట్టిన రమేష్‌
  • ఏసీబీ దాడితో జిల్లాలో కలకలం

 

విశాఖపట్నం జిల్లా గాజువాకలో సీనియర్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎంవీఐ)గా పనిచేస్తున్న సంపతరావు రమేష్‌ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలకి మంగళవారం చిక్కిన విషయం జిల్లాలో సంచలనం రేపింది. రమేష్‌ స్వతహాగా ఆస్తిపరుడైనప్పటికీ ఆయన సంపాదించిన ఆస్తులు చూసి తెల్లబోవడం జిల్లా వాసుల వంతయింది. ఈయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం అక్కవరం గ్రామానికి చెందినవారు. ఈయనది మొదటి నుంచి సంపన్న కుటుంబమే అయినప్పటికీ భారీస్థాయిలో ఆస్తులు కూడగట్టిన సమాచారంతో అంతా అవాక్కయ్యారు. రూ.25కోట్ల మేర ఆస్తులు కూడగట్టినట్టు ఏసీబీ అధికారులు లెక్క తేల్చడంతో జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈయన మొదట అసిస్టెంట్‌ ఎంవీఐగా ఇచ్ఛాపురంలోని చెక్‌పోస్టు వద్ద ఉద్యోగంలో చేరారు.
అనంతరం ఇచ్ఛాపురం ఎంవీఐగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత పార్వతీపరం, శ్రీకాకుళం, విశాఖ, గాజువాక ప్రాంతాల్లో ఎంవీఐగా పనిచేశారు. ఎక్కడ పనిచేసినా అక్కడ ఆయా ప్రాంతాల్లో వివాదాస్పదునిగా ముద్ర పడ్డారు.
వసూల్‌ రాజాగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం గాజువాకలో పనిచేస్తున్న సంపదరావు రమేష్‌ ఆస్తులను గుర్తించేందుకు ఏసీబీ అధికారులకు తలప్రాణం తోకకు వస్తోంది. బుధవారం కూడా ఏసీబీ అధికారులు ఈయన ఆస్తులను గుర్తించే పనిలోనే నిమగ్నమయ్యారు. లాకర్లను తెరవక ముందే ఈయన ఆస్తులను చూసి అధికారుల కళ్లు బైర్లుగమ్మాయి. స్వగ్రామంలో ఏసీబీ అధికారులు దాడులు జరిపినా నామమాత్రమే అయ్యాయి. కానీ విశాఖలో ఆయన నివాసంలో భారీగా ఆస్తులను గుర్తించారు. ఏకంగా కిలోకిపైగా బంగారం, 2.5 కేజీల వెండి, రూ.10 లక్షల నగదును చూసి అధికారులు ఆశ్చర్యర్యానికి గురైనట్లు సమాచారం. దీనికి తోడు జిల్లా వాసుడు కావటంతో ఈ ప్రాంత వాసులు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. ఇంత ఆస్తులా అంటూ నోళ్లు తెరిచారు.rameah
Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

10 + = 16