“ఐటం సాంగ్ కి ఓకే చెప్పిన కాజోల్”

ఆ మధ్య కెరీర్ పరంగా కాస్తంత వెనకడుగు వేసిన కాజల్, ఇప్పుడు మళ్ళీ ఫామ్‌లోకి వచ్చింది. మహేశ్ బాబు సరసన ముచ్చటగా మూడోసారి ‘బ్రహ్మోత్సవం’లో నటిస్తుండగా, పవన్ కళ్యాణ్‌తో తొలిసారి ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో జత కట్టింది. ఇదే సమయంలో తన తోటి స్టార్ హీరోయిన్ల మాదిరి ఐటమ్ సాంగ్‌లోనూ నర్తించాలని కాజల్ కలలు కంటోంది. ఇప్పటికే టాలీవుడ్ టాప్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్న తమన్నా, శృతిహాసన్‌లు ఐటం బ్యూటీలుగా నటించేశారు. నిజానికి కాజల్‌కు కూడా ఐటమ్ సాంగ్ ఆఫర్ గతంలోనే వచ్చింది. అప్పుడు పెద్దంత పట్టించుకోని కాజల్ ఇప్పుడు మాత్రం ఓకే చెప్పేసిందట. ఇండ్రస్టీ వర్గాలకు సైతం తన మనసులో మాటను తెలిపిందట. దాంతో కాజల్‌తో ఐటమ్ సాంగ్ చేసేందుకు కొందరు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. మరి ఏ స్టార్ హీరో చిత్రంలో ఆమె హాట్ హాట్ ఐటమ్ సాంగ్‌లో నర్తిస్తుందో చూడాలి.Baadshah New Stills

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − = 15