“ఏపి డైట్ సెట్ 23 నుంచి వెబ్ కౌన్సిలింగ్”

డైట్‌సెట్‌ ర్యాంకర్లకు ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు ఆనలైన్ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు డైట్‌సెట్‌ చైర్‌పర్సన్ సంధ్యారాణి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వారీగా ఉన్న డైట్‌ కళాశాల్లో మొదటి దశ వెబ్‌ కౌన్సెలింగ్‌ 23వ తేదీన ప్రారంభమవుతుందని తెలిపారు. 26 నుంచి 28వ తేదీ వరకు సీట్ల కేటాయింపు, 30న విద్యార్థులకు కేటాయించిన సంస్థల వివరాల ప్రకటిస్తామని తెలిపారు. డిసెంబరు 1 నుంచి మూడో తేదీ వరకు డైట్‌ కళాశాలల్లో ప్రిన్సిపల్స్‌ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ట పరిశీలన నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు డిసెంబరు 8లోగా కళాశాలల్లో చేరాలని పేర్కొన్నారు. రెండో దశ వెబ్‌ కౌన్సెలింగ్‌ డిసెంబరు 14 నుంచి 16 వరకు, సీట్ల కేటాయుయింపు 17 నుంచి 19 వరకు, సంస్థల వివరాలు ప్రకటన 20న, విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలన డిసెంబరు 21 నుంచి 23 వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు డిసెంబరు 26న కళాశాలల్లో చేరాల్సి ఉంటుందని తెలిపారు.AP-DEECET-2015

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

30 + = 40