“సర్దార్ సెంటిమెంట్ పై హిట్టు అంటున్న అభిమానులు”

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు కొన్ని సెంటిమెంట్స్ కలిసొస్తున్నాయట…ఆ సెంటిమెంట్స్ ప్రకారం ‘సర్దార్’ బంపర్ హిట్ ఖాయమంటున్నారు అభిమానులు.
 తిరుగులేని పవన్- దేవిశ్రీ కాంబో
ఈ సెంటిమెంట్‌లో మొదటిది ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు కావడం. ఇప్పటి వరకు పవన్ చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన మూడు సినిమాలు బంపర్ హిట్స్ కావడం విశేషం… వాటిలో మొదటిది జల్సా, రెండోది గబ్బర్ సింగ్, మూడోది అత్తారింటికి దారేది… ఇలా మూడు సినిమాలు బంపర్ హిట్టయ్యాయి కాబట్టి, పవన్, దేవిశ్రీ కాంబినేషన్‌లో రానున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కూడా బంపర్ హిట్టవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకుంటున్నారు.
 కలిసొచ్చే కాజల్
‘గబ్బర్ సింగ్’లో ఉన్న గ్యాంగ్ అంతా ‘సర్దార్ గబ్బర్ సింగ్’లోనూ నటిస్తున్నారు కాబట్టి, మళ్ళీ ఈ సినిమా కూడా హిట్టవుతుందని ఫ్యాన్స్ అభిలాష. అంతేకాక కాజల్ తొలిసారి జోడీ కట్టిన హీరోల చిత్రాలన్నీ జనాన్ని బాగానే ఆకట్టుకున్నాయి… అలాగే ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో పవన్ సరసన కాజల్ మొదటిసారి నటిస్తోంది కాబట్టి ఈ సినిమా కూడా విజయాన్ని మూటకట్టుకుంటుందని అభిమానుల ఆశ… మరి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి…Sardar-Gabbar
Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

+ 58 = 64