“ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్”

విజయవాడ: నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా అంశంపై జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ సీరియస్‌గా స్పందించారు. సీమాంధ్రకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కేంద్రానికి ఎదురుదెబ్బ తగులుతుందని, ఇచ్చిన మాటపై వెనక్కి తగ్గితే బీజేపీకే నష్టమని పవన్‌ వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమైన తర్వాత పవన్ మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలను “అమలు చెయ్యను” అని కేంద్రం అంటే నా రియాక్షన్‌ వేరుగా ఉంటుంది… అన్నారు. చంద్రబాబుతో తన సమావేశంలో ప్రత్యేక హోదాపై కూడా చర్చించామంటూ ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజిపై కేంద్రం నుంచి నిర్ణయం వచ్చాకే భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ప్రశ్నకు “చేస్తామంటున్నారుగా .. చూద్దాం” అన్నారు. కాగా, బీజేపీకి వ్యతిరేక ఫలితాన్నిచ్చిన బిహార్‌ ఎన్నికల తీర్పుపై స్పందించేందుకు పవన్‌ నిరాకరించారు.jana

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

61 − = 53