భారత్ తొలి ఇన్నింగ్స్ 375 ఆలౌట్..

Virat-Kohli-and-Shikhar-Dhawan-of-India-talk శ్రీలంకతోజరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ 375 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో ధావన్, కోహ్లీలు శతకాలతో రెచ్చిపోయారు. ఓవర్ నైట్ స్కోరు 128/2 తో రెండో రోజు భారత్ ఆట ఆరంభించింది. ఓపెనర్ ధావన్ తనదైన శైలిలో ఆడాడు. శ్రీలంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని బాల్ ను బౌండరీలకు తరలించాడు. శర్మ (9) కొద్ది సేపు మాత్రమే క్రీజులో నిలుచున్నాడు. అనంతరం వచ్చిన కోహ్లీ మెల్లి మెల్లిగా స్కోరును పరుగెత్తించాడు. వీరిని విడదీద్దామని అనుకున్న శ్రీలంక బౌలర్ల ప్రయత్నాలు విఫలం చెందాయి. ఈ దశలో ధావన్ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ కలిసి 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మరోవైపు అర్ధ సెంచరీ సాధించిన కోహ్లీ తనదైన శైలిలో ఆడాడు. 191 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. భారత జట్టు స్కోరు 255 పరుగుల వద్ద ఉన్నప్పుడు కోహ్లీ (103) పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన రహానే ఎమీ పరుగులు చేయకుండానే అవుట్ అయ్యాడు. ధావన్ కు సాహా జతకలిశాడు. సాహా లంక బౌలర్లను చీల్చిచెండాడే ప్రయత్నం చేశాడు. మంచి ఊపు మీదున్న ధావన్ (134) ను ప్రదీప్ అవుట్ చేశాడు. దీనితో 257 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయినట్లైంది. అనంతరం అర్ధ సెంచరీ సాధించిన సాహా (60) కూడా పెవిలియన్ చేరాడు. మిగతా బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అశ్విన్ (7), హర్భజన్ సింగ్ (14), మిశ్రా (40), శర్మ (3), అరోన్ (4) పరుగులు మాత్రమే చేశారు. శ్రీలంక బౌలర్లలో కౌశాల్ ఐదు, ప్రదీప్ మూడు, ప్రసాద్, మాథ్యూస్ చెరో వికెట్ తీశారు. భారత్ మొత్తం 191 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.

శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ : 183 ఆలౌట్. మాథ్యూస్ (64), దినేష్ చందిమాల్ (59).
భారత్ బౌలింగ్ : 
అశ్విన్ 46/6, మిశ్రా 20/2, శర్మ 30/1, అరోన్ 68/1
భారత్ మొదటి ఇన్నింగ్స్ : 375 ఆలౌట్. ధావన్ (134), కోహ్లీ (103), సాహా (60)
శ్రీలంక బౌలింగ్ : కౌశాల్ 134/5, ప్రదీప్ 98/3, ప్రసాద్ 54/1, మాథ్యూస్ 12/1.

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

+ 54 = 57