శివరాత్రి కథ :: బ్రహ్మ మొగలిపువ్వు పూజించుటకు ఎందుకు అనర్హులయ్యారు??

Mahasivarathri

మహాశివుడు, లింగావతరంలో ఉధ్భవించిన కధ….
బ్రహ్మ, విష్ణువులు ఇద్దరిలో ఎవరు గోప్పవారు అని సందేహం కలిగింది. బ్రహ్మ, విష్ణు మూర్తుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు.. ఎవరు గొప్పవారో? తేల్చుకోవాలనే స్థితికి పోటీపడసాగారు అప్పుడు ఒకరితో ఒకరు యుద్దనికి దిగి, వివిధ రకాల అస్త్రలతో పోట్లడుకుంటారు, చివరిగా బ్రహ్మ పాశుపతాస్త్రం ని, విష్ణువు మహేశ్వరాస్త్రం ని ప్రయోగిస్తారు.ఆ రేండు అస్త్రలు చేసే విధ్వంసాన్ని ఆపడం ఎవరివల్ల కాదు. అప్పుడు మహాశివుడు అగ్నిస్తంభ రూపంలో వారిరువురి మధ్య నిలుస్తాడు..
బ్రహ్మ విష్ణువుతో పోరాటం చేయడం అంతా విష్ణుమాయ. విష్ణుమాయ చేత కప్పబడ్డాడు కనుక బ్రహ్మదెవునకు ఏమి గుర్తు రావడం లేదు. ఇద్దరు యుద్ధంలో మునిగియున్న సమయంలో కళ్ళు మిరమిట్లు గొలిపే వెలుగుతో, పెళపెళ శబ్దం చేసుకుంటూ విద్యుత్ స్థభం/మహాతేజో లింగం ఒకటి ప్రత్యక్షమైంది. దానికి ఆది, అంతాలు లేవు. అది అలా వేగంగా పెరుగుపోతూనే ఉంది. అది అవ్యక్త రూపం. సమస్త విశ్వానికి మూలమైనది. విష్ణువు వేసిన మహేశ్వరాస్త్రమూ, బ్రహ్మ వేసిన పాశుపతాస్త్రమూ ఆ మహాకాంతి స్థంభంలో కలిసిపోయాయి.
ఆ లింగాన్ని చూసిన విష్ణువు మోహితుడయ్యాడు. బ్రహ్మ కూడా ఆశ్చర్యపోయాడు. ఆ లింగం నుండి ‘మీ ఇద్దరిలో ఈ లింగం యొక్క ఆదిని కాని, అంతమును కానీ, ఎవరు తెలుకుని, ముందు ఈ ప్రదేశానికి చేరుకుంటారో వారే గొప్పవారు’ అని మాటలు వినిపించగా, అప్పుడు విష్ణువు బ్రహ్మతో ‘ఈ యుద్ధం ఇక్కడితో చాలిద్దాం. ఇప్పుడు మనమిద్దరం కాకుండా మూడవ శక్తి ఇక్కడ ఉన్నది. దాని గురించి తెలుసుకుందాం. బ్రహ్మ! నువ్వు హంస రూపంలో ఈ లింగం యొక్క పై భాగాన్ని తెలుసుకునే ప్రయతనం చేయ్యి, నేను వరాహ రూపంలో ఈ లింగం యొక్క క్రింది భాగాన్ని, ఆరంభ భాగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను’ అన్నాడు విష్ణువు. ఇద్దరూ వారివారి నిర్దేశిత రూపాల్లో అన్వేషణ ప్రారంభించారు.
విష్ణువు కొన్ని కోట్ల సంవత్సరాల పాటు పయనించినా, ఆ లింగం యొక్క ప్రారంభ స్థానం కనుగినలేకపోయాడు. ఎంత క్రిందకు వెళ్ళినా, ఆ లింగం యొక్క మూలం ఇంకా దొరకడంలేదు. తనకు ఇది సాధ్య కాదని శ్రీ మన్నారయణుడు, యుద్ధం జరిగిన ప్రదేశానికి చేరుకుంటాడు.
బ్రహ్మదేవుడు ఎంతో కాలం పైకి ప్రయాణించినా, ఆ లింగం చివరి భాగం అంతుబట్టడం లేదు. అది ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంది. ఏం చేయాలో బ్రహ్మకు అర్ధం కావడంలేదు. తన అధిపత్యాన్ని నిరూపించుకోవాలని, విష్ణువుకంటే తనకే అధిక గౌరవం దక్కాలని బ్రహ్మ భావించాడు.
ఇంతలొ పై నుంచి కేతకీ పుష్పం క్రిదకు వస్తోంది. ఆ పుష్పాన్ని ఆపి, నువ్వెక్కడి నుంచి వస్తున్నావని అడుగుతాడు బ్రహ్మదేవుడు. నేను ఈ మహాలింగాన్ని అర్చింది క్రిందకు వస్తున్నా అంటుంది, అయితే నేకు దీని అగ్రభాగం తెలుసా? నువ్వు చూశావా? అని బ్రహ్మదేవుడు అడుగుతాడు. చూశానండీ! కానీ ఈ లింగం పెరిగిపోతూనే ఉన్నది. నేను దీను అగ్రభాగాన్ని తాకి, కొన్ని కోట్ల సంవత్సరముల నుంచి క్రిందకు పడుతూనే ఉన్నాను. ఈ లింగం చాలా పెద్దది. ఇది ఇప్పటికి ఇంకా పెరిగిపోయి ఉంటుంది. దీని అగ్రభాన్ని తెలుసుకోవడం అసాధ్యం అంటుంది కేతకీ పుష్పం.
అప్పుడు విష్ణువు ఈశ్వరుని గొప్పతనాన్ని తెలుసుకుని శరణు వేడుతాడు.. కానీ బ్రహ్మ, తనే గొప్ప అనిపించుకోవాలని తాను లింగాగ్రాన్ని చూసిన సమయంలో మొగలిపువ్వు కూడా అక్కడే ఉన్నట్లు సాక్ష్యం చెప్పమంటాడు… దానికి మొగలిపువ్వుకూడా అంగీకరిస్తుంది… పైనుండి క్రిందకు దిగటం ప్రారంభిస్తారు.. ఒకా నొక ప్రదేశంలో విష్ణువు, మహేశ్వరుడు ఉన్న స్థానంలో తాను చూసినందుకు సాక్ష్యంగా మొగలిపువ్వును చూపిస్తాడు బ్రహ్మ.. కానీ మహేశ్వరునికి అంతా తెలుసు కాబట్టి , వారు చెప్పింది అసత్యమని.. ఈ విధంగా అసత్యంతో నెగ్గాలని చూసారు కాబట్టి వారు పూజకు అనర్హులని శాపమిస్తాడు మహేశ్వరుడు..
దానికి ప్రతి శాపంగా బ్రహ్మ నీవుకూడా కేవలం లింగ రూపంలోనే పూజలందుకుంటావు.. సహజ రూపంలో ఎవరూ నీకు పూజ చేయకుండు కాక అని శాపమిస్తాడు. (అగస్త్యముని కూడా శివుడు లింగ రూపంలోనే పూజలందుకుంటాడనే శాపం గురించిన ఒక కథ కూడా ఉంది)
(అందుకే ఆ రోజునుండి… బ్రహ్మ, మొగలిపువ్వు పూజకు అర్హత లేక పూజలందుకోవటం లేదు… ఈశ్వరుడు కేవలం లింగ రూపంలోనే పూజలందుకుంటున్నాడు… ఇది వేరే కథ)
చివరకు ఆ పరమ శివుడు అనుగ్రహించి తన నిజరూపంతో దర్శనమిచ్చి.. వారి అహంకారాన్ని మట్టికలిపినట్లు పండితులు చెబుతున్నారు. దీంతో బ్రహ్మ, విష్ణువులు పరమేశ్వరుని ఆధిక్యతను గుర్తించి, పరమాత్మను విశేష పూజలతో సేవించి కీర్తించినారు. ఆ పర్వదినమే “మహాశివరాత్రి” అయ్యిందని పురాణాలు చెబుతున్నాయి.
అందుచేత సత్య, జ్ఞాన, అనంత స్వరూప గుణాతీతుడైన పరబ్రహ్మ.. శంకరదేవుణ్ణి మహాశిరాత్రి నాడు పూజిస్తే మోక్షమార్గం సిద్ధిస్తుంది. కాబట్టి మహాశివరాత్రి (శివరాత్రి 17.02.15)పర్వదినాన మహేశ్వరుడిని ప్రార్థించి.. ఆయన అనుగ్రహం పొందండి…
మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు!!

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 + 5 =