పాలపై తొరకేల? , Layer forms on Milk after heating why?

పాలను వేడి చేస్తే దానిపై తొరక ఎందుకు ఏర్పడుతుంది? పాలలో ఉప్పువేస్తే విరిగిపోతాయెందుకు?

పాలు ఒక మిశ్రమ పదార్థం. పాల అంతర్గత నిర్మాణాన్ని పరిశీలిస్తే అణువులు కాకుండా, అణు సముదాలయాలయిన గుచ్ఛాలు (clusters or assemblies or aggregates) కనిపిస్తాయి. వీటి పరిమాణాన్ని బట్టి పాలను కొల్లాయిడ్‌ (colloid) అనే ద్రావణంగా వర్గీకరించారు. మొత్తానికి పాలలో లాక్టోజ్‌, మాల్టోజ్‌ వంటి కార్బొరేట్‌ రేణువులు ఉంటాయి. వీటితో పాటు కొన్ని ప్రొటీన్లు, తైలబిందువులు (fat globules) కూడా ఉంటాయి. పాలకు తెల్లని రంగునిచ్చేవి కూడా ఈ పదార్థాలే. పాలను వేడి చేసినప్పుడు కొన్ని రేణువులు ఒకదానికొకటి దగ్గరై పెద్దవిగా మారుతాయి. ఇవన్నీ కలవడం వల్లనే తొరక ఏర్పడుతుంది. తొరక సాంద్రత పాల సాంద్రత కన్నా తక్కువగా ఉండడం వల్ల అది తెట్టులాగా ఏర్పడుతుంది. ఇక పాలలో ఉప్పు వేసినప్పుడు అందులోని రేణువులు పీచులాగా పేరుకుపోతాయి. కారణం వీటిని స్థిరంగా ఉండే విద్యుదావేశాలను ఉప్పులోని సోడియం, క్లోరైడు అయాన్లు ధ్వంసం చేయడమే. ఈ స్థితినే మనం విరిగిన పాలు అంటాము.

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

− 1 = 6